ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ యాత్రకు ఈ సంవత్సరం యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ యాత్రికులకు తెరిచిన చార్ ధామ్‌ను లక్షలాది మంది భక్తులు భక్తులు తరలివెళ్లారు. ఈ యాత్రను మన దేశ ప్రజలు ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ యాత్ర కోసం ఎంతో ఖర్చు చేసి అక్కడికి వెళ్తుంటారు భక్తులు..కానీ, భక్తుల నిర్లక్ష్యం కారణంగా ఈ పుణ్యక్షేత్రాల మార్గాలు చెత్తకుప్పలుగా మారుతున్నాయి. ఎటూ చూసినా కుప్పలు తెప్పలుగా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి దర్శనమిస్తున్నాయి.
ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన భక్తుల్లో చాలా మంది అక్కడి నియమాలను ఏమాత్రం పాటించడం లేదు. ప్లాస్టిట్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగులు, చెత్తా చెదారం ఎక్కడ పడితే అక్కడే విచ్చలవిడిగా పారేవేస్తున్నారు. లక్షాదిమంది సందర్శిస్తుండటంతో అభయారణ్యంలోని మార్గాలు అక్షరాల చెత్తకుండీగా మారుతున్నాయంటూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు గుర్తించి ఫొటోలను షేర్ చేశాయి. ఈ క్రమంలో యాత్రికుల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపాయి. దీనిపై స్పందించిన గర్వాల్ సెంట్రల్ యూనివర్శిటీ జాగ్రఫీ ప్రొఫెసర్ ఎంఎస్ నాగి ఇలా అన్నారు..’కేదార్‌నాథ్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం మన పర్యావరణానికి హానికరం. దీంతో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది. 2013లో జరిగిన విషాదాన్ని మనం మరచిపోకూడదని హెచ్చరించారు.
Uttarakhand | Heaps of plastic waste & garbage pile up on the stretch leading to Kedarnath as devotees throng for Char Dham Yatra pic.twitter.com/l6th87mxD9
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 22, 2022
పవిత్ర చార్ ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 39 మంది యాత్రికులు మరణించారు. మార్గమధ్యంలో గుండెపోటు, రక్తపోటు, పర్వతారోహణ కారణంగా ఈ మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు. గంగోత్రి యమునోత్రి యాత్ర మే 3న, కేదార్‌నాథ్ యాత్ర మే 6న, బద్రీనాథ్ యాత్ర మే 8న ప్రారంభమైంది. అధికార సిబ్బంది పటిష్ట చర్యలు తీసుకున్నప్పటికీ పలు చోట్ల ఇలాంటి విషాద సంఘటనలు సంభవించాయని అధికారులు తెలిపారు.