Treasure: ఈశ్వర ఆలయ ప్రాంగణంలో తవ్వకాలు.. లంకె బిందెలో బంగారు నాణేలు, నగలు

|

Nov 13, 2023 | 11:12 AM

టాటా కాఫీ కార్పొరేషన్‌కు చెందిన కాఫీ తోటలో పురాతన ఈశ్వర దేవాలయం ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో కూలీలు పని చేస్తుండగా.. భూమిలోపల మట్టి కుండ కనిపించింది. అందులో బంగారు ఆభరణాలు కనిపించాయి. ఇదే విషయాన్ని టాటా కాఫీ ఫామ్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విరాజ్‌పేట తహసీల్దార్ సమక్షంలో ఊరేగింపు నిర్వహించి కొడగు జిల్లా కలెక్టర్‌కు నిధిని అందజేశారు.

Treasure: ఈశ్వర ఆలయ ప్రాంగణంలో తవ్వకాలు..  లంకె బిందెలో బంగారు నాణేలు, నగలు
Treasure Found In Temple
Follow us on

పురాతన వైభవానికి చిహ్నంగా అలనాటి వస్తువులు, నిర్మాణాలు ఎక్కడో చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేట తాలూకా ఆనంద్‌పూర్ గ్రామంలోని పురాతన ఈశ్వర ఆలయ ప్రాంగణంలో  పురాతన కాలం నాటి నిధి లభ్యమైంది. ఆలయ ప్రాంగణంలో కూలీలు పనులు చేస్తుండగా మట్టి కుండ బయటపడింది. అందులో అతిపురాతన బంగారు నాణేలు బయల్పడ్డాయి.

టాటా కాఫీ కార్పొరేషన్‌కు చెందిన కాఫీ తోటలో పురాతన ఈశ్వర దేవాలయం ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో కూలీలు పని చేస్తుండగా.. భూమిలోపల మట్టి కుండ కనిపించింది. అందులో బంగారు ఆభరణాలు కనిపించాయి.

ఇదే విషయాన్ని టాటా కాఫీ ఫామ్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విరాజ్‌పేట తహసీల్దార్ సమక్షంలో ఊరేగింపు నిర్వహించి కొడగు జిల్లా కలెక్టర్‌కు నిధిని అందజేశారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు దేవుడి విగ్రహం పగలగొట్టిన దుండగులు

బెంగళూరులోని సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ దారుణ ఘటన బెంగళూరులోని బొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బలమూరి ఆలయ గోపురం పైభాగంలో సుబ్రహ్మణ్యస్వామి పట్టుకున్న ఆయుధం విరిగిపోయింది. మునిరెడ్డి అనే వ్యక్తి బొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..