Watch: బెంగళూరులో IAF వింగ్‌ కమాండర్‌, బైకర్‌ గొడవలో ట్విస్ట్‌.. బయటకు వచ్చిన మరో వీడియో..

బెంగళూరులో భారత వైమానిక దళ (IAF) వింగ్‌ కమాండర్‌, బైకర్‌ గొడవలో అసలు నిజం బయటకు వచ్చింది. ఈ కేసులో అసలు ఎవరు ఎవరి మీద ఎటాక్‌ చేశారు. తప్పు చేసిందెవరు? అన్న ప్రశ్నల నడుమ కొత్తకోణం బయటకు వచ్చింది. దాడికి సంబంధించిన CCTV వీడియో బయటకు రావడంతో IAF వింగ్‌ కమాండర్‌ బోస్‌ డ్రామా బయట పడింది.

Watch: బెంగళూరులో IAF వింగ్‌ కమాండర్‌, బైకర్‌ గొడవలో ట్విస్ట్‌.. బయటకు వచ్చిన మరో వీడియో..
Bengaluru Road Rage Case

Updated on: Apr 22, 2025 | 6:36 PM

బెంగళూరులో భారత వైమానిక దళ (IAF) వింగ్‌ కమాండర్‌, బైకర్‌ గొడవలో అసలు నిజం బయటకు వచ్చింది. ఈ కేసులో అసలు ఎవరు ఎవరి మీద ఎటాక్‌ చేశారు. తప్పు చేసిందెవరు? అన్న ప్రశ్నల నడుమ కొత్తకోణం బయటకు వచ్చింది. దాడికి సంబంధించిన CCTV వీడియో బయటకు రావడంతో IAF వింగ్‌ కమాండర్‌ బోస్‌ డ్రామా బయట పడింది. వింగ్‌ కమాండరే బైకర్‌పై దాడిచేసినట్లు పోలీసులు తేల్చారు. ముందు తనపై దాడి జరిగిందంటూ వింగ్‌ కమాండర్ ఆరోపించారు. తీరా CCTV ఫుటేజ్‌ బయటకు వచ్చాక, వింగ్‌ కమాండరే దాడి చేసినట్లు బయటపడింది.

ఈ ఘటన అనంతరం దీని చుట్టూ పెద్ద డ్రామా నడిచింది. కారులో వెళ్తున్న తమను కొందరు వ్యక్తులు బైక్‌పై వచ్చి అడ్డగించి దాడి చేశారని వింగ్‌ కమాండర్‌ బోస్‌, ఆయన భార్య ఆరోపించారు. కన్నడంలో మాట్లాడలేదని తమపై దాడి చేశారని బోస్ ఒక వీడియో రిలీజ్ చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా దుమారంగ చెలరేగింది. ఈ ఇష్యూ కన్నడ వర్సెస్ నాన్ కన్నడ అన్నట్టు మారిపోయింది. ప్రభుత్వం కూడా సీరియస్‌గా రియక్ట్‌ అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు.. బోస్ చెప్పింది వేరు.. అక్కడ జరిగింది వేరంటూ సీసీటీవీ విజువల్స్‌ రిలీజ్‌ చేశారు. విజువల్స్‌లో చూస్తే… తొలుత బోస్‌ దాడికి దిగినట్లుగా కనిపిస్తోంది. కిందపడేసి మరీ కొట్టాడు. ఆపేందుకు వచ్చిన వారిపై కూడా దాడి చేసినట్లు రికార్డయ్యింది. అసలు విషయం బయటకు రావడంతో కర్నాటక ప్రభుత్వం కూడా IAF వింగ్‌ కమాండర్‌ తీరుపై సీరియస్‌ అయింది. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని సీఎం సిద్దరామయ్య హెచ్చరించారు.

వీడియో చూడండి..

చంపడానికి ప్రయత్నించాడు..

బెంగళూరులో రోడ్డుపై జరిగిన ఘర్షణలో భారత వైమానిక దళ వింగ్ కమాండర్‌పై దాడి చేసినందుకు అరెస్టయిన కాల్ సెంటర్ ఉద్యోగి మంగళవారం ఐఏఎఫ్ అధికారిపై ప్రతి ఫిర్యాదు దాఖలు చేశాడు. ఆయన తనను చంపడానికి ప్రయత్నించాడని ఆరోపించాడు. వింగ్ కమాండర్ శిలాదిత్య బోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో, IAF అధికారి భార్య స్క్వాడ్రన్ లీడర్ మధుమిత దత్తా దాఖలు చేసిన దాడి ఫిర్యాదు ఆధారంగా, 27 ఏళ్ల వికాస్ కుమార్‌ను బయ్యప్పనహళ్లి పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఈ ఘటనపై వికాస్ కుమార్ ప్రతి ఫిర్యాదు దాఖలు చేశారని.. విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని పోలీసు వర్గాలు మంగళవారం తెలిపాయి.

కాగా.. ముందు బైకర్ పై దాడి చేసి.. అబద్దం చెప్పిన IAF వింగ్‌ కమాండర్‌ ను అరెస్టు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..