కర్ణాటక రాజకీయాల్లో్ కీలక పరిణామం చోటుచేసుకోబోతుంది. మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్‌రెడ్డి మళ్లీ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు విజయేంద్ర సమక్షంలో కాషాయం కండువా కప్పుకోబోతున్నారు. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయమన్నారు గాలి జనార్ధన్ రెడ్డి. 2022లో స్థాపించిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు జనార్దన్ రెడ్డి ప్రకటించారు.
లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక బీజేపీకి పెద్ద బూస్ట్ లభించబోతోంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి సొంత గూటికి చేరుకుంటున్నారు. సోమవారం గాలి బీజేపీలో చేరుతున్నారు. మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నేతల సమక్షంలో పార్టీలోకి చేరనున్నట్టు ప్రకటించారు. బీజేపీ తమ రక్తంలో ఉందన్నారు. ఇప్పుడు సొంత పార్టీలోకి తిరిగి వస్తున్నట్లు చెప్పారు.
బీజేపీకి బయట నుంచి మద్దతు ఇవ్వాలని తొలుత భావించినట్టు, కానీ తమ పార్టీ కార్యకర్తలు విలీనానికి ఓటు వేశారని చెప్పారు. బీజేపీ తమ రక్తంలోనే ఉందని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయ్యేందుకు తాను మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ పార్టీలో చేరి సాధరణ కార్యకర్తగా పని చేస్తానన్నారు.
పార్టీలో చేరాలని బీజేపీ నుంచి తనకు ఆహ్వానం అందిందన్నారు గాలి జనార్థన్‌రెడ్డి. సోమవారం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు విజయేంద్ర సమక్షంలో బీజేపీలో చేరబోతున్నట్టు తెలిపారు. చిత్రదుర్గ, గుల్బర్గా, కొప్పల్, రాయచూర్, బళ్లారి, విజయనగరం నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు తన నిర్ణయానికి మద్దతు తెలిపారని అన్నారు. బీజేపీలో పార్టీని విలీనం చేసేందుకు అందరూ అంగీకరించారని అన్నారు. బళ్లారితో సహా అన్ని జిల్లాల కార్యకర్తలు పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరారు. అందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉంది. సోమవారం విజయేంద్ర సమక్షంలో బీజేపీలో చేరుతున్నని గాలి జనార్ధన్ రెడ్డి ప్రకటించారు.
కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని 2022లో స్థాపించారు గాలి జనార్దన్ రెడ్డి. ఇప్పుడు ఆ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి, పార్టీ నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. జనార్దన్ రెడ్డితో పాటు పార్టీ నేతలంతా బీజేపీ కండువా కప్పుకోనున్నారు. కొద్దిరోజుల క్రితమే ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గాలి జనార్ధన్ రెడ్డి సమావేశమయ్యారు. తరువాత తన పార్టీ మద్దతుదారులతో, కేర్పీపీ భవిష్యత్తుపై చర్చించారు. పార్టీని బీజేపీలో విలీనం చేయాలనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…