Chicken Curry: చికెన్‌ కర్రీ కోసం కొట్టుకున్న తండ్రీకొడుకులు.. ఒకరు మృతి..

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితి పరిశీలించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి శివరామ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Chicken Curry: చికెన్‌ కర్రీ కోసం కొట్టుకున్న తండ్రీకొడుకులు.. ఒకరు మృతి..
Chicken Curry

Updated on: Apr 06, 2023 | 7:57 PM

కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కోడి కూర విషయంలో తలెత్తిన వివాదం వ్యక్తి నిండుప్రాణాన్ని బలితీసుకుంది. దక్షిణ కన్నడ జిల్లాలోని సూలీయా తాలూకా గుత్తిగర్ గ్రామంలో మంగళవారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శివరామ్ (33) అనే వ్యక్తి కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం పనిమీద బయటకు వెళ్లాడు. అయితే అదే రోజు ఇంట్లో కోడి కూర వండగా.. కుమారుడికి కొంచెం కూడా ఉంచకుండా తండ్రి సీన మొత్తం తినేశాడు. పనిముగించుకొని తిరిగొచ్చిన శివరామ్‌ విషయం తెలుసుకుని తండ్రితో గొడవకు దిగాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ తారాస్థాయికి చేరింది.

ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన తండ్రి.. పక్కనే ఉన్న దుడ్డుకర్ర తీసుకుని కుమారుడి తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన శివరామ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితి పరిశీలించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి శివరామ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతుడు శివరామ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..