కర్ణాటకలో హిజాబ్ (Karnataka Hijab Row) రగడ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై వివాదం..తీవ్ర సంచలనం సృష్టించింది. హిజాబ్‌కు వ్యతిరేకంగా, అనుకూలంగా ఆందోళనలు జరిగాయి. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ పూర్తి చేసింది హైకోర్ట్. ఇవాళ తీర్పు వెలువరించనుంది. దీంతో కోర్టు ఏం చెబుతుందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హైకోర్ట్ తీర్పు నేపథ్యంలో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఉడిపి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
బెంగళూరులో మార్చి 15 నుంచి మార్చి 21 వరకు అంటే ఒక వారం పాటు అన్ని రకాల సమావేశాలు, ఆందోళనలు, నిరసనలు, బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిషేధించనున్నట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. ఇంతకుముందు మార్చి 8 వరకు రెండు వారాల పాటు నిషేధాజ్ఞలు విధించబడ్డాయి. ఆర్డర్ ప్రకారం, బెంగళూరు అంతటా విద్యాసంస్థలకు 200 మీటర్ల పరిధిలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ఎలాంటి సమావేశాలు, ఆందోళనలు, నిరసనలు లేదా ఇతర కార్యకలాపాలపై నిషేధం ఉంటుంది. రేపటి నుండి మార్చి 21 వరకు కొనసాగుతుంది. ప్రజా శాంతి భద్రతలను కాపాడేందుకు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
షిమోగా మరియు ఉడిపిలో పాఠశాల-కళాశాలలు మూసివేయబడ్డాయి
ఇవాళ (మార్చి 15) షిమోగాలో అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేడం విషయం. షిమోగా జిల్లాలో మార్చి 21 వరకు 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు శివమొగ్గ ఎస్పీ బీఎం లక్ష్మీప్రసాద్ తెలిపారు. కేఎస్‌ఆర్‌పీకి చెందిన 8 కంపెనీలు, జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్‌కు చెందిన 6 కంపెనీలు, ఆర్‌ఏఎఫ్‌కు చెందిన 1 కంపెనీలను ఇక్కడ మోహరించారు. ఉడిపి జిల్లాలో కూడా ఇలాంటి ఆంక్షలు ప్రకటించారు. ఉడిపిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఇవాళ సెలవు ఉంటుందని ఉడిపి జిల్లా మేజిస్ట్రేట్ కూర్మరావు ఎం తెలిపారు. నిన్న కర్ణాటక హైకోర్టు హిజాబ్ వివాదం నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలోని కలబురగి జిల్లాలో మార్చి 19 రాత్రి 8 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ విధించబడింది. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు మంగళవారం కూడా సెలవు.
ఇవి కూడా చదవండి: Wi-Fi Repeater: వైఫై రూటర్‌కు ధీటుగా Wi-Fi రిపీటర్.. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఉందా..