Lockdown in Karnataka: దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ లక్షలాది కేసులు నమోదవుతుండగా.. వేలాది మంది మరణిస్తున్నారు. ఈ తరుణంలో అంతటా ఆందోళన నెలకొంది. కరోనా కట్టడి కోసం ఇప్పటికే పలు రాష్ట్రాలో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక యడియూరప్ప ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రంలో 14 రోజులపాటు లాక్‌డౌన్ విధించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అవసరమైన సేవలకు కూడా ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి రాష్ట్రంలో 14 రోజులపాటు లాక్‌డౌన్ చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అవసరమైన సేవలకు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దీంతోపాటు ఉదయం 10 గంటల తరువాత అన్ని దుకాణాలను మూసివేయనున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. నిర్మాణం, తయారీ, వ్యవసాయ రంగాలకు మాత్రమే అనుమతి ఉంటుందని.. ప్రజా రవాణా కూడా మూసివేస్తున్నట్లు ఆయన తెలిపారు.
నిన్న కర్ణాటకలో 34, 804 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2,62,162 క్రియాశీల కేసులున్నాయి. బెంగళూరులోనే అత్యధికంగా 20వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
Also Read: