Karnataka: రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. SBI, PNBలతో ప్రభుత్వ లావాదేవీల నిషేధం!

|

Aug 15, 2024 | 10:16 AM

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లకు సిద్దరామయ్య సర్కార్‌ షాకిచ్చింది. రెండు బ్యాంకులతో తో అన్ని లావాదేవీలను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Karnataka: రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. SBI, PNBలతో ప్రభుత్వ లావాదేవీల నిషేధం!
Dk Shiva Kumar Siddaramaiah
Follow us on

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లకు సిద్దరామయ్య సర్కార్‌ షాకిచ్చింది. రెండు బ్యాంకులతో తో అన్ని లావాదేవీలను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. SBI, PNB బ్యాంకుల్లోని ఖాతాలను మూసివేయాలని, డిపాజిట్లను వెంటనే రికవరీ చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లో నిర్వహించే ఖాతాలను రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌లు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, యూనివర్సిటీలు, ఇతర ప్రభుత్వ సంస్థలు రద్దు చేయాలని ఆ ఆర్డర్‌లో పేర్కొన్నారు. అలాగే ఇకపై ఈ బ్యాంకుల్లోని ప్రభుత్వ ఖాతాల్లో డిపాజిట్లు చేయవద్దని స్పష్టం చేశారు. సీఎం సిద్ధరామయ్య ఆమోదించిన ఈ ఉత్తర్వును ఆర్థిక కార్యదర్శి జారీ చేశారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనట్లు కర్ణాటక ప్రభుత్వం ఆరోపించింది.

నిధుల దుర్వినియోగంపై ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికి తీరుమారలేదని తెలిపింది. రెండు బ్యాంకుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, సమస్య అపరిష్కృతంగా ఉండడంతో ప్రభుత్వం ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ, పీఎన్బీ ఖాతాల్లో అన్ని లావాదేవీలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై రెండు బ్యాంకులు , కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.. మహర్షి వాల్మీకి కార్పొరేషన్‌ నిధుల గోల్‌మాల్‌లో బ్యాంకు అధికారుల హస్తముందని కర్ణాటక ప్రభుత్వం ఆరోపిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..