తెలంగాణలో పవర్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ఈ కరెంట్ ఎఫైర్‌ని అందిపుచ్చుకున్న గులాబీ దళం.. కాంగ్రెస్ వ్యాఖ్యలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతోంది. అంతేకాదు..గులాబీసేనకు ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ఇదే ప్రధానాస్త్రంగా మారింది. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికీ ఇదే డ్యూటీ. సవాళ్లు, ప్రతిసవాళ్లతో కరెంట్ మంటలు హైవోల్టేజ్‌ను తలపిస్తున్నాయి.
రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరాపై అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమ ప్రభుత్వ హయాంలో రైతులకు 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పి..బోల్తా పడ్డారని బీఆర్‌ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ చెప్పే 3 గంటల కరెంట్ కావాలా..? లేక 24 గంటలు ఇచ్చే ప్రభుత్వం కావాలా..? అంటూ ప్రతి సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధ్యక్షుడు HD.కుమారస్వామి మండిపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన మండిపడ్డారు.ఐదు గ్యారంటీలని కాంగ్రెస్ జిమ్మిక్కులు చేస్తోందని విమర్శించారు. కర్ణాటకలో 5 గ్యారంటీలు ఎక్కడా అమలుకావడంలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏ విద్యుత్ సబ్ స్టేషన్ వెళ్లినా ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారో ఇట్టే తెలిసిపోతుందని ఎద్దేవా చేశారు. ముందుగా కర్ణాటకలో సరైన పాలన చేస్తూ, ఇతర రాష్ట్రాల్లో వెళ్లి నీతులు చెప్పాలంటూ హితవు పలికారు.
కర్ణాటకలో 5 గంటల కరెంట్ సాగుకు ఎక్కడ ఇస్తున్నారో చూపెట్టాలని డిమాండ్ చేశారు కుమారస్వామి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలంగాణకు వెళ్లి అన్ని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు, 5 గంటల కరెంట్ ఏమో గానీ, కరప్షన్, కమీషన్లు, రైతుల ఆత్మహత్యల ఘోష మధ్య పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు హెచ్‌డీ కుమారస్వామి. వన్ స్టేట్..మెనీ ఎలక్షన్స్ అనే తీరుతో కాంగ్రెస్ దోచుకుంటోందని మండిపడ్డారు.
అంతకుముందు బీజేపీ ప్రభుత్వం కర్ణాటక రైతులకు రూ. 4,000 ఇచ్చేదని, దాన్ని ఆపి రైతులకు ద్రోహం చేశారంటూ కాంగ్రెస్‌పై హెచ్‌డి కుమారస్వామి మండిపడ్డారు. ఇప్పటి వరకు నయా పైస పరిహారం ఇవ్వలేదన్న ఆయన.. రాష్ట్రంలో 65 లక్షల హెక్టార్లలో పంటలు నష్టపోయాయన్నారు. ఐదు రాష్ట్రాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆరోపించారు. 10 లక్షల కుటుంబాలకు గృహలక్ష్మి ఒక్క పైసా కూడా విడుదల చేయలేదన్ని మండిపడ్డారు. సర్వర్ డౌన్ అని చెప్పి.. కర్ణాటక ప్రజలకు ఇంటి దీపం వెలిగించి ఆశీర్వదించారని వ్యంగ్య ఆస్త్రాలు సంధించారు.
ఓటర్లకు గ్యారంటీ కార్డు అంటూ ఎలక్షన్‌కు రెండ్రోజుల ముందు పంపిణీ చేసి, మోసంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు హెచ్‌డీ. కుమారస్వామి.
#WATCH | Bengaluru: Former Karnataka CM and JD(S) leader HD Kumaraswamy says, " In Karnataka, before the election, they (Congress) announced 5 guarantee schemes and they wanted to expand all these schemes across the country to get the vote of people. These 5 guarantees have… pic.twitter.com/xncZ4Mc252
— ANI (@ANI) November 12, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…