Karnataka Ex CM: భారతీయ జనతా పార్టీ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప మనవరాలు సౌందర్య(30) ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం నాడు తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే, సౌందర్య ఉరి వేసుకోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న సౌందర్య సెంట్రల్ బెంగళూరులోని నివాసం ఉంటోంది. ఆమెకు నాలుగు నెలల పాప కూడా ఉంది. అయితే పోస్ట్ ప్రెగ్నెన్సీ డిప్రెషన్ కారణంగానే సౌందర్య ఆత్మహత్య చేసుకున్నట్లు వైద్యులు అభిప్రాయపడ్డారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం సౌందర్య మృతదేహాన్ని బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. సౌందర్య ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
The postmortem of Soundarya, the granddaughter of former Karnataka CM BS Yediyurappa’s granddaughter, is underway at Bowring and Lady Curzon Hospital in Bengaluru. She was found hanging at a private apartment in Bengaluru.
Visuals from the hospital. pic.twitter.com/tgBW52E9Rt
— ANI (@ANI) January 28, 2022
Also read:
SBI Rules Change: మారిన ఎస్‌బిఐ సర్వీస్ రూల్స్.. ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి.. పూర్తి వివరాలివే..
T.Congress: అలక పాన్పుపై మరో టి.కాంగ్రెస్ నేత.. గాంధీ భవన్‌కు దూరంగా..
PGIMER Jobs: పీజీఐఎమ్ఈఆర్‌లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్… త్వరలో ముగియనున్న గడువు!