ఎన్నికల వేళ చెట్లకు డబ్బులు కాయడం ఎప్పుడైనా చూశారా..? వీడియో వైరల్

|

May 04, 2023 | 9:10 AM

ఎన్నికల వేళ అక్రమ డబ్బులు దాచడానికి కొందరు రాజకీయ నాయకులు క్రియేటివ్ ప్లాన్లు వేస్తున్నారు. తాజాగా ఓ కాంగ్రెస్ నేత ఇలా క్రియేటివ్ ప్లాన్‌ అమలు చేసి అడ్డంగా దొరికిపోయిండు. కర్నాటక ఎన్నికల్లో పోటి చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడు..

ఎన్నికల వేళ చెట్లకు డబ్బులు కాయడం ఎప్పుడైనా చూశారా..? వీడియో వైరల్
Cash On Tree At Congress Leader's Brother House
Follow us on

ఎన్నికల వేళ అక్రమ డబ్బులు దాచడానికి కొందరు రాజకీయ నాయకులు క్రియేటివ్ ప్లాన్లు వేస్తున్నారు. తాజాగా ఓ కాంగ్రెస్ నేత ఇలా క్రియేటివ్ ప్లాన్‌ అమలు చేసి అడ్డంగా దొరికిపోయిండు. కర్నాటక ఎన్నికల్లో పోటి చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడు సుబ్రమణ్య రాయ్‌ ఇంటిపై బుధవారం (మే 3) ఐటీ దాడులు నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో జనానికి పంచడానికి తెచ్చిన కోటి రూపాయల నగదును మూటకట్టి పెరట్లోని మామిడి చెట్టుపై దాచారు. ఐనా ఐటీ అధికారులు కనిపెట్టి స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్ సోదరుడి ఇంట్లో ఈ డబ్బు మూట దొరికింది. వివరాల్లోకెళ్తే..

మైసూరులోని కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు అశోక్ కుమార్ రాయ్ సోదరుడు సుబ్రమణ్య రాయ్ నివాసంపై ఐటి శాఖ దాడులు చేసింది. కర్ణాటకలో జరగనున్న రాష్ట్ర ఎన్నికల్లో పుత్తూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్ పోటీచేస్తున్నారు. బుధవారం సుబ్రమణ్య రాయ్‌ ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేయగా పెరట్లోని మామిడి చెట్టుపై డబ్బు మూట దొరికింది. అందులో ఎంత క్యాష్ ఉందని లెక్కపెట్టగా రూ. కోటి ఉందని తేలింది.

ఇవి కూడా చదవండి

ఎన్నికల ప్రచారానికి అక్రమంగా వినియోగించేందుకే ఈ డబ్బును దాచినట్లు సమాచారం. ఇక ఈ ఐటీ రైడ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కర్ణాటక ఎన్నికలకు ముందు ఐటీ అధికారులు వరుస దాడులు నిర్వహించి ఇప్పటివరకు రూ.110 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి 2,346 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.