
కర్నాటక రాజకీయాల్లో జి. జనార్దన రెడ్డికి పెద్ద పేరు. ఒకప్పుడు సుష్మాస్వరాజ్‌కు అత్యంత సన్నిహితుడిగా భావించే జనార్దన్ రెడ్డి ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల పాటు బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. అక్రమ మైనింగ్ కేసులో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత గత ఏడాది డిసెంబర్‌లో కళ్యాణ్ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ) అనే కొత్త పార్టీని స్థాపించారు. ఆయన ఈ పార్టీ టికెట్‌పై గంగావతి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గాలి పార్టీలో ఫ్యూచర్ కనిపించడం లేదా.. ఎగ్జిట్ పోల్స్‌లో గాలి ఊసే లేదెందుకు. కర్ణాటక రాజకీయాల్లో ప్రభుత్వాలనే మార్చిన ఘనత గాలిది. కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ప్రభుత్వాలనే మార్చిన ఘనత ఆయనది. వ్యూహాత్మక రాజకీయాలకు పేరొందిన గాలి జనార్దన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో కూడా తన సత్తా చూపిస్తారా..లేదంటే మాటలతోనే సరిపెడతారా..
కొప్పళ జిల్లా పరిధిలో ఉందిగంగావతి సీటుఆయన స్వయంగా బళ్లారి జిల్లా నుంచి పోటీ చేస్తుండగా, ఆయన భార్య అరుణలక్ష్మి బళ్లారి సిటీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కేఆర్‌పీపీకే టికెట్‌పై దేవర సోమశేఖరరెడ్డిపై ఆమె పోటీ చేస్తున్నారు. జి జనార్ధన రెడ్డిఆయన బీజేపీకి చెందిన పరణ ఈశ్వరప్ప మునవల్లి, ఐఎన్‌సీ అభ్యర్థి ఇక్బాల్ అన్సారీతో ప్రత్యక్ష పోటీలో ఉన్నారు. జనతాదళ్ (ఎస్) హెచ్‌ఆర్ చన్నకేశవ్‌ను రంగంలోకి దించింది. ఈ స్థానానికి మే 10న ఓటింగ్ నిర్వహించి మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
బీజేపీతో విసిగి వేసారిన గాలి జనార్దన్ రెడ్డి బయటకొచ్చి.. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టారు. అదే కల్యాణ కర్ణాటక ప్రగతి పార్టీ..ఈ పార్టీ గుర్తే ఫుట్‌బాల్ సింబల్. రెండు జాతీయపార్టీలను ఫుట్‌బాల్ అడినట్లు ఆడుకోవాలన్న గాలి ఈ సారి అగ్ని పరీక్షకు నిలుచున్నారు.
గాలి జనార్దన్ రెడ్డి బళ్లారికి వచ్చేందుకు సీబీఐ ఇంకా అనుమతి ఇవ్వడం లేదు. అందుకే గంగావతి కూర్చునే చక్రం తిప్పారు. పార్టీ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో 15 స్థానాల్లో పార్టీ తరపున అభ్యర్థులను గాలి జనార్ధన్ రెడ్డి బరిలో నిలిపినా.. బళ్లారి సిటీ అభ్యర్థి గాలి లక్ష్మీ అరుణ, కొప్పళ జిల్లా గంగావతిలో గాలి జనార్దన్ రెడ్డి గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు సాగాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన గాలి జనార్దన్ రెడ్డి పార్టీ కేఆర్‌పీపీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో కొన్ని గంటల్లో తెలియనుంది.
తాను ఎంతో సేవ చేసినా బీజేపీ చివరికి తన జీవితంతో ఆడుకుందని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఎవరు ఎన్ని చేసినా నేను భయపడను, కేఆర్ పీ పార్టీ అంటే ఏమిటో త్వరలోనే చూపిస్తానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు., తనతో పాటు తన పార్టీ టిక్కెట్ మీద పోటీ చేస్తున్న నాయకులు అందరిని ప్రజలు గెలిపిస్తారని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఎగ్జిట్ పోల్స్‌లో మాత్రం గాలి పార్టీ గురించి అస్సలు ఊసే లేదు. అంటే పార్టీలో ధమ్ లేదా.. గాలి పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులు గెలవలేరనుకున్నారా.. బళ్లారి, కొప్పళ జిల్లాలో పట్టున్న గాలి జనార్దన్‌రెడ్డి.. బళ్లారి సిటీలో తన అన్న సోమశేఖర్ రెడ్డిపైనే తన భార్య అరుణను నిలబెట్టారు. తాను మాత్రం గంగావతిలో పోటీ చేశారు. పార్టీలో ఎవరు గెలిచినా గెలవకపోయినా.. గాలి జనార్దన్‌రెడ్డి,అరుణమాత్రం గెలిచి తీరాలి. లేదంటే ఫుట్‌బాల్‌లో గాలి లేనట్లే.. మరి కాసేపట్లో కౌంటింగ్ షురూ అవుతుంది. గాలి గెలుస్తారా..ఎన్నికల్లో ప్రభావం చూపిస్తారా.
మరిన్ని జాతీయ వార్తల కోసం