Karnataka Hijab row: హిజాబ్ (hijab) కారణంగా కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజులపాటు సెలవులు మంజూరు చేస్తూ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయ్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఉడిపి, శివమొగ్గ, బాగల్‌కోట్‌తో సహా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లోని విద్యా సంస్థల వద్ద ఈ రోజు జరిగిన హిజాబ్ వ్యతిరేక నిరసనల కారణంగా ఉద్రిక్తత నెలకొంది. ‘హిజాబ్’కు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రతరం కావడంతో ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలు, కళాశాలలకు రాబోయే మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. శాంతి భద్రతల కోసం అందరూ సహకరించాలని అభ్యర్ధిస్తూ ఈ విధంగా ట్వీట్ చేశారు.. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాలలు, కళాశాలల యాజమాన్యంతో పాటు కర్ణాటక ప్రజలకు శాంతి, సామరస్యాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకు రానున్న మూడు రోజుల పాటు అన్ని ఉన్నత పాఠశాలలు, కళాశాలలను తాత్కాలికంగా మూసివేయాలని ప్రకటన జారీ చేస్తున్నాను. దయచేసి అందరూ సహకరించండి’ అని బొమ్మై ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా ఉడిపి, శివమొగ్గ, బాగల్‌కోట్‌లతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలోని కొన్ని విద్యాసంస్థల వద్ద ఈరోజు హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. దీంతో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు, అధికారులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఉడిపిలోని ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కళాశాలలో చదువుతున్న ఐదుగురు బాలికలు కాలేజీలో హిజాబ్ యూనాఫాం ధరించడంపై ఉన్న ఆంక్షలను ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై నేడు కర్ణాటక హైకోర్టు (Karnataka High Court ) విచారణ జరపనుంది. విచారణ అనంతరం కోర్టు ఉత్తర్వులు వెలువడే వరకు సామరస్యతను కాపాడని రాష్ట్ర ప్రజలకు సీఏం బొమ్మై విజ్ఞప్తి చేశారు.
ರಾಜ್ಯದಲ್ಲಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು, ಶಿಕ್ಷಕರು, ಶಾಲೆ, ಕಾಲೇಜುಗಳ ಆಡಳಿತ ಮಂಡಳಿಗಳು ಹಾಗೂ ನಾಡಿನ ಸಮಸ್ತ ಜನತೆಯಲ್ಲಿ ಶಾಂತಿ ಸೌಹಾರ್ದತೆ ಕಾಪಾಡುವಂತೆ ಮನವಿ ಮಾಡುತ್ತೇನೆ. ಮುಂದಿನ ಮೂರು ದಿನಗಳ ಅವಧಿಗೆ ಶಾಲೆ ಕಾಲೇಜುಗಳಿಗೆ ರಜೆ ಘೋಷಿಸುವಂತೆ ಆದೇಶಿಸಲಾಗಿದ್ದು, ಸಂಬಂಧಿಸಿದ ಎಲ್ಲರೂ ಸಹಕರಿಸಲು ಕೋರುತ್ತೇನೆ.
— Basavaraj S Bommai (@BSBommai) February 8, 2022
Also Read: