ఢిల్లీలో రోడ్ టెర్రర్‌కు బలైన 20 ఏళ్ల యువతి కేసులో కొత్త విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. అంజలిపై అత్యాచారం జరగలేదని పోస్ట్‌మార్టమ్ నివేదిక వెల్లడించినట్టు తెలుస్తోంది. బాధితురాలి కుటుంబసభ్యులు మాత్రం యువతిపై అత్యాచారం చేసి చంపేశారని ఆరోపిస్తున్నారు. యువతి ప్రైవేట్ పార్ట్స్‌లో ఎలాంటి గాయాలు లేవని పోస్ట్‌మార్టమ్ చేసిన వైద్యులు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ యాక్సిడెంట్‌కు సంబంధించి కొత్త విషయాలు బయటపడుతున్నాయి. అంజలి సింగ్‌తో పాటు
స్కూటీపై మరో యువతి కూడా వెళ్లినట్టు సీసీటీవీ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రమాదం జరిగిన తరువాత మరో యువతి అక్కడి నుంచి పారిపోయినట్టు గుర్తించారు. అయితే ఆమెకు ఎలాంటి గాయాలు తగలలేదని పోలీసులు తెలిపారు. ఆ యువతిని ఢిల్లీ పోలీసులు విచారించారు.
యాక్సిడెంట్‌కు సంబంధించి ఆమె ప్రత్యక్షసాక్షి అని పోలీసులు చెబుతున్నారు. న్యూఇయర్ వేడుకల వేళ.. ఢిల్లీ సుల్తాన్‌పురిలో టూవీలర్ పై వెళుతున్న అంజలీ సింగ్‌ని ఫుల్లుగా తాగి ఉన్న యువకులు నడుపుతున్న కారు ఢీకొట్టి, ఆమెను 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్ళింది.
కారు చక్రంలో ఇరుక్కున్న యువతి మృతదేహం అత్యంత వేగంగా కారు యూటర్న్ తీసుకున్నా కారునుంచి బయటకు రాలేదు. బయటి వ్యక్తులు ప్రమాదాన్ని గమనించి బయటినుంచి అరిచినా ప్రయోజనం లేకపోయింది.
#WATCH | Kanjhawala death case: CCTV footage of that night shows the presence of another girl with the girl who died after being dragged for a few kilometres by a car that hit her in Sultanpuri area.
(CCTV visuals confirmed by police) pic.twitter.com/nd1NUBQVze
— ANI (@ANI) January 3, 2023
ఈ ఘటన యావత్ దేశంలో సంచలనం సృష్టించింది.తండ్రి మరణించడంతో ఇంటి బాధ్యతలు నిర్వహిస్తోన్న అంజలి ఫంక్షన్స్‌లో పార్ట్ టైంగా పనిచేస్తోంది. ఓ ఫంక్షన్‌లో విధులు నిర్వర్తించి ఇంటికి వెళుతున్న అంజలిని మృత్యువు వెంటాడింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం