
కరోనా పాజిటివ్ లక్షణాలు సోకిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ లక్నోలో బస చేసిన హోటల్లోనే సౌతాఫ్రికా జట్టు కూడా దిగిందట. ఓ డీ ఐ సిరీస్ కోసం ఇండియాకు చేరుకున్న ఈ జట్టు సభ్యులు సైతం ఆమె ఉన్న హోటల్లోనే ఉన్నట్టు ఓ అధికారి తెలిపారు. ఆ రోజున ఆ హోటల్ ఫుడ్ తిరస్కరించిన ఆమె.. గత ఆదివారం లాబీలో పలువురు గెస్టులను కూడా కలుసుకున్నట్టు తెలిసింది. పైగా ఆ రోజున ఆ హోటల్లో జరిగిన ఓ ఛానల్ వార్షిక కార్యక్రమానికి సైతం ఆమె హాజరయిందని ఆయన చెప్పారు. ఆ రోజున కనికా కపూర్ ని కలుసుకున్నవారి వివరాలన్నీ సీసీటీవీ ఫుటేజీ ద్వారా స్కాన్ చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. నిజానికి సౌతాఫ్రికా జట్టు మూడు వన్ డే లు ఆడవలసి ఉన్నప్పటికీ కరోనా కారణంగా అవి రద్దయ్యాయి. వారు గత ఆదివారం నాడు కోల్ కతా చేరుకున్నారని, దుబాయ్ ద్వారా తమ తమ గమ్యాలకు వెళ్లారని తెలిసింది. అనంతరం వారంతా సెల్ఫ్ ఐసొలేషన్ కి వెళ్లారు. కాగా- లండన్ నుంచి తిరిగి వఛ్చిన కనికా కపూర్.. తాను క్వారంటైన్ కి వెళ్లకుండా నిర్లక్ష్యం చేయడాన్ని అనేకమంది నెటిజన్లు తప్పు బట్టారు. ఇప్పటికీ ఆమె తన తప్పును ఒప్పుకోకపోవడం విశేషం.