AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంగనా ఓ మెంటల్‌ కేసు ః శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌

నిన్న శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ మీద బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఫైరయ్యేసరికి, ఇవాళ సంజయ్‌రౌత్‌ కంగనా మీద విరుచుకుపడ్డారు.. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత కంగనా రనౌత్‌ బాలీవుడ్‌లోని కొందరు పెద్దలను ఓ రేంజ్‌లో కడిగిపారేస్తున్నారు.

కంగనా ఓ మెంటల్‌ కేసు ః శివసేన ఎంపీ  సంజయ్‌రౌత్‌
Anil kumar poka
|

Updated on: Sep 04, 2020 | 4:45 PM

Share

నిన్న శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ మీద బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఫైరయ్యేసరికి, ఇవాళ సంజయ్‌రౌత్‌ కంగనా మీద విరుచుకుపడ్డారు.. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత కంగనా రనౌత్‌ బాలీవుడ్‌లోని కొందరు పెద్దలను ఓ రేంజ్‌లో కడిగిపారేస్తున్నారు. అలాగే విచారణ సరిగ్గా జరపడం లేదంటూ ముంబాయి పోలీసులను ఆడిపోసుకున్నారు.. దీంతో సంజయ్‌రౌత్‌కు మండుకొచ్చింది.. పార్టీ అధికార పత్రిక సామ్నాలో ఘాటుగానే విమర్శించారు.. దానికి జవాబుగా ముంబాయి పోలీసులపై నమ్మకం లేకపోతే నగరంలోకి రావద్దంటూ సంజయ్‌రౌత్‌ తనను బెదరించారంటూ కంగనా రనౌత్‌ మీడియా ముందుకొచ్చారు.. దీనికి కౌంటర్‌ ఇవ్వడానికి సంజయ్‌ మళ్లీ మాట్లాడాల్సి వచ్చింది.. తాము ఎవరినీ బెదరించమని, ముంబాయి నగరాన్ని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చేవారికి పీఓకే గురించి ఏమీ తెలియదని, ముంబాయి, మహారాష్ట్రలను కించపరచడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని బదులిచ్చారు శివసేన ఎంపీ. ముంబాయి నగర విశిష్టతను ఆమెకు వివరించారు.. 26/11 ముష్కరుల దాడుల సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడింది పోలీసులే అన్న విషయం మర్చిపోకూడదని కంగనాకు సంజయ్‌ సూచించారు. అలాగే 1992 ముంబాయిలో వరుస పేలుళ్లు సంభవించినప్పుడు నగరాన్ని, నగర ప్రజలను కాపాడింది కూడా వారేనని చెప్పారు. కరోనా వైరస్‌తో పోరాడుతున్న క్రమంలో పలువురు ముంబాయి పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాలను ఎవరూ మర్చిపోరని సంజయ్‌ రౌత్‌ తెలిపారు.

Follow Us
ఇలా చేస్తే ఇంట్లోనే హోటల్ స్టైల్ కాఫీ టేస్ట్.. ఈ పొరపాట్లు అస్సలు
ఇలా చేస్తే ఇంట్లోనే హోటల్ స్టైల్ కాఫీ టేస్ట్.. ఈ పొరపాట్లు అస్సలు
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
ఉద్యోగాల పేరుతో కోట్లు వసూళ్లు, నకిలీ అపాయింట్‌మెంట్లు!
ఉద్యోగాల పేరుతో కోట్లు వసూళ్లు, నకిలీ అపాయింట్‌మెంట్లు!
వీరికి మేలు చేయడానికి కదిలి వస్తున్న భారీ గ్రహాలు.. మీరున్నారా?
వీరికి మేలు చేయడానికి కదిలి వస్తున్న భారీ గ్రహాలు.. మీరున్నారా?
మీ వయసు 20 దాటిందా? ఈ సూత్రాలు పాటిస్తే ఫ్యూచర్‌లో తిరుగుండదు
మీ వయసు 20 దాటిందా? ఈ సూత్రాలు పాటిస్తే ఫ్యూచర్‌లో తిరుగుండదు
కాళ్లకు చెప్పులు లేకుండా నడిస్తే బీపీ తగ్గుతుందా?
కాళ్లకు చెప్పులు లేకుండా నడిస్తే బీపీ తగ్గుతుందా?
పాన్ కార్డులో పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలా..?
పాన్ కార్డులో పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలా..?
'జట్టు నుంచే కాదు, కెప్టెన్సీ పోస్ట్ కూడా పీకేస్తారనుకోలే'
'జట్టు నుంచే కాదు, కెప్టెన్సీ పోస్ట్ కూడా పీకేస్తారనుకోలే'
నీట్ పరీక్షకు వెళ్లే ముందు ఇవి చెక్ చేస్కోండి..!
నీట్ పరీక్షకు వెళ్లే ముందు ఇవి చెక్ చేస్కోండి..!
భరించలేని కండరాల నొప్పులను క్షణాల్లో తగ్గించే పెయిన్ కిల్లర్..
భరించలేని కండరాల నొప్పులను క్షణాల్లో తగ్గించే పెయిన్ కిల్లర్..