KALIA Scheme: రైతుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్థికంగా ఆదుకునేందుకు కొత్త పథకం

|

May 02, 2022 | 8:53 PM

KALIA Scheme: కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు కూడా రైతులకు (Farmers) మేలు చేకూర్చే పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వెన్నుముకగా నిలుస్తున్న అన్నదాతలను ..

KALIA Scheme: రైతుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్థికంగా ఆదుకునేందుకు కొత్త పథకం
Follow us on

KALIA Scheme: కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు కూడా రైతులకు (Farmers) మేలు చేకూర్చే పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వెన్నుముకగా నిలుస్తున్న అన్నదాతలను ఆదుకునేందుకు వివిధ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఇక తాజాగా ఒడిశా (Odisha) రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. దీని ద్వారా రైతులకు అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులకు వ్యవసాయానికి తోడుగా డబ్బు కొరత రాకుండా సాయంగా నిలుస్తోంది. ఒడిశాలో ఈసారి అక్షయ తృతీయ 2022 (Akshay Tritiya 2022) సందర్భంగా అంటే మే 3వ తేదీన రాష్ట్రంలోని 40 లక్షల మంది రైతులకు జీవనోపాధి, ఆదాయ పెంపుదల కోసం కృషక్ సహాయం కింద అర్హులైన రైతులకు 2000 రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతుంది. కలియా పథకం కింద ఈ ప్రయోజనం రైతులకు అందించబడుతుంది.

మీడియా నివేదికల ప్రకారం.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఈ సహాయాన్ని విడుదల చేయనున్నారు. కలియా పథకం కింద రాష్ట్రంలోని 40 లక్షల మందికి పైగా చిన్న, సన్నకారు రైతులకు మొత్తం రూ.800 కోట్ల సాయం అందించనున్నారు. ఈ పథకం కింద ప్రతి రైతు డీబీటీ ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయనున్నారు.

ప్రతి సంవత్సరం రైతులకు 4000 రూపాయలు ఇస్తున్నారు:

కలియా పథకం కింద ఒడిశాలో అర్హులైన రైతులకు రెండు విడతలుగా ఏటా రూ.4000 అందజేస్తారు. రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి ఒకసారి రబీ పంటకు రూ.2000, ఖరీఫ్ సీజన్‌కు రూ.2000 అందజేస్తున్నారు. దీని ద్వారా రైతులకు సాగు సమయంలో వ్యవసాయానికి ఆర్థిక సహాయం అందుతుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీని కింద రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలలో ఈ పథకాన్ని వచ్చే మూడేళ్లకు పొడిగించింది.

ఒడిశా రైతులకు రూ.9000 కోట్ల రుణం ఇవ్వాలనే లక్ష్యం..

ఈ ఖరీఫ్ సీజన్‌లో ఒడిశా ప్రభుత్వం వివిధ సహకార సంస్థల సహకారంతో రాష్ట్ర రైతులకు రూ.9000 కోట్ల రుణాలు అందించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలోని రైతులకు ప్రాధాన్యత ఆధారంగా రుణాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. ఖరీఫ్‌ సీజన్‌లో సాగుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగా ఎక్కువ రుణాలు అవసరమున్న రైతులను గుర్తించి వారికి రుణాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

PM KISAN Samman Nidhi Yojana: రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్‌ 11వ విడత డబ్బులు.. ఎప్పుడు అంటే..?

Supreme Court: ప్రతి ఒక్కరు కోవిడ్‌ టీకా తీసుకోవాలా? ఆర్టికల్-21 ఏం చెబుతోంది?