Justice UU Lalit: 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్.. రాష్ట్రపతి ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ..

|

Aug 10, 2022 | 6:38 PM

భారత అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియమితులయ్యారు. కేంద్ర న్యాయ శాఖ సూచన మేరకు ప్రస్తుత సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ..

Justice UU Lalit: 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్.. రాష్ట్రపతి ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ..
Justice Uday Umesh Lalit
Follow us on

Justice UU Lalit: భారత అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియమితులయ్యారు. కేంద్ర న్యాయ శాఖ సూచన మేరకు ప్రస్తుత సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. యూయూ లలిత్ పేరును తదుపరి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేశారు. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో భారత అత్యున్నత న్యాయస్థానం తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ ను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈనియామకం ఈనెల 27వ తేదీన అమలులోకి రానుంది. ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం ఈనెల 26వ తేదీతో ముగియనుంది. ఆతరువాత రోజు జస్టిస్ యూయూ లలిత్ తో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు. భారత రాజ్యాంగంలోని 124వ అధికరణంలోని క్లాజ్ (2) ద్వారా అందించబడిన అధికారాలను అమలు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనియామకాన్ని చేపట్టినట్లు కేంద్ర న్యాయశాఖ పేర్కొంది.

సుప్రీంకోర్టు నుండి సిఫార్సు ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన వారిలో జస్టిస్ యూయూ.లలిత్ రెండోవ వారు. ఈవిధమైన నియామకం పొందిన వారిలో 1971లో అప్పటి 13వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎం.సిక్రీ మొదటివారు. జస్టిస్ యూయూ.లిలిత్ కేవలం రెండు నెలల 12 రోజులు మాత్రమే ఈపదవిలో ఉండనున్నారు. ఆగష్టు 27వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనుండగా.. నవంబర్ 8తో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. 2014లో ఆగష్టులో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడానికి ముందు జస్టిస్ యూయూ లలిత్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు. ఆయన తండ్రి యూఆర్.లలిత్ సీనియర్ న్యాయవాదిగానూ, బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా సేవలందించారు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలోని మెజార్టీ న్యాయమూర్తులల్లో లలిత్ ఒకరు. ఎన్నో కీలకమైన తీర్పులో యూయూ.లలిత్ భాగస్వామిగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..