viral, జస్టిస్ చంద్రచూడ్ ‘పడిపోయారా ‘ ? సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా సరికొత్త గమ్మత్తు !

| Edited By: Phani CH

Apr 30, 2021 | 7:42 PM

దేశంలో కోవిడ్ పరిస్థితిపై శుక్రవారం సుప్రీంకోర్టులో వీడియో ద్వారా  విచారణ జరుగుతుండగా..సాంకేతిక సమస్య తలెత్తింది. విచారణ సమయంలో జస్టిస్ మాట్లాడుతున్నప్పుడు కొద్దిసేపు వీడియో డిస్ కనెక్ట్ అయింది.

viral, జస్టిస్ చంద్రచూడ్ పడిపోయారా  ? సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా సరికొత్త గమ్మత్తు !
Justice Fallen Off A Lighter Moment
Follow us on

దేశంలో కోవిడ్ పరిస్థితిపై శుక్రవారం సుప్రీంకోర్టులో వీడియో ద్వారా  విచారణ జరుగుతుండగా..సాంకేతిక సమస్య తలెత్తింది. విచారణ సమయంలో జస్టిస్ మాట్లాడుతున్నప్పుడు కొద్దిసేపు వీడియో డిస్ కనెక్ట్ అయింది. ఈ సందర్భంలో ఓ లాయర్..’ బహుశా చంద్రచూడ్ పడిపోయారేమో’ అని చమత్కరించాడు. కాగా కొద్దిసేపటికే న్యాయమూర్తికి సంబంధించి వీడియో రీకనెక్ట్ కావడంతో.. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా..’చూడబోతే ఆ లాయర్ సముచిత పదాన్ని వాడినట్టు లేదు ‘ అని  వ్యాఖ్యానించారు.  కానీ జస్టిస్ చంద్రచూడ్ దీన్ని తేలిగ్గా తీసుకున్నారు. ‘అరే ! వో తో పరమాత్మా కే హాథ్ మే హై ‘ ( అది దేవుడి చేతుల్లో ఉంది) అని పేర్కొన్నారు. సుమారు 20 సెకండ్ల పాటు తన లాగింగ్ పోయిందని ఆయన తెలిపారు. అత్యున్నత న్యాయస్థానంలో ఈ తరహా ఘటన జరగడం ఇదే మొదటిసారి.

ఇక దేశంలో ఈ కోవిద్ విపత్కర సమయంలో.. ప్రజలు నిర్భయంగా తమ ఇబ్బందులను, సమస్యలను సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ దృష్టికి తేవచ్చునని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మహమ్మారి అదుపులో వారు పోలీసులకు, అధికారులకు సహకరించాలని, సరైన సమాచారం ఇవ్వాలని సూచించింది. తప్పుడు సమాచారం ఇస్తే అది కోర్టు ధిక్కారమే అవుతుందని కూడా హెచ్చరించింది. ప్రజల గళాలను తాము వినగోరుతున్నామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. దేశంలో ఆక్సిజన్, మందుల కొరతను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, కేంద్రం ఓ నిర్దిష్ట ప్రణాళికతో ఈ సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని కూడా సలహాఇచ్చింది . దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పరోక్షంగా పేర్కొంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..

Digital Frauds: క‌రోనా క‌ష్ట స‌మ‌యాన్ని సొమ్ము చేసుకుంటున్న సైబ‌ర్ నేర‌గాళ్లు.. భార‌త్‌లో పెరుగుతున్న మోసాలు..