పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇంకా పలుచోట్ల నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, ఈశాన్యా రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక వెస్ట్ బెంగాల్‌లో కొనసాగుతున్న నిరసనలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో.. ఆందోళనకారులు అనేక బస్సులను, ట్రైన్‌లను తగలబెట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగాడీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరసన కార్యక్రమాల పేరుతో ఎవరైనా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే.. వారిని అక్కడికక్కడే కాల్చిపారేయండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఈ పౌరసత్వ బిల్లు పార్లమెంటులో ఆమోదించినప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ నష్టం కలిగిస్తున్నారు. వెస్ట్ బెంగాల్లోని ముర్షీదాబాద్ రైల్వే స్టేషన్‌పై ఆందోళనకారులు మూక దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా స్టేషన్‌లోకి చొరబడి అక్కడ ఉన్న ట్రైన్లకు నిప్పంటించారు. ఈ ఘటనలపై కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్ అంగాడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఇలా నిరసనల పేరుతో ప్రజా ఆస్తిని ధ్వంసం చేసే వారిని అక్కడికక్కడే కాల్చేయండంటూ అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే రైల్వే శాఖ భారీ నష్టాల్లో ఉందని.. ఇలా ఆందోళనల పేరుతో ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని.. ఇక ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు.
#WATCH Union Min of State of Railways, Suresh Angadi speaks on damage to properties. Says “…I strictly warn concerned dist admn&railway authorities, if anybody destroys public property, including railway, I direct as a Minister, shoot them at sight…” #CitizenshipAmendmentAct pic.twitter.com/VeUpZY7AjX
— ANI (@ANI) December 17, 2019