5G implementation in India – Juhi Chawla: బాలీవుడ్ ప్రముఖ నటి, పర్యావరణవేత్త జుహీ చావ్లా ఢిల్లీ హైకోర్టు మెట్లక్కారు. దేశంలో 5జి మొబైల్ టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా జూహీ చావ్లా పిటిషన్ దాఖలు చేశారు. రేడియో ఫ్రీకెన్సీ రేడియేషన్ (ఆర్ఎఫ్) దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు జుహీ చావ్లా కృషి చేస్తున్నారు. 5జీ టెక్నాలజీతో మనుషులు, మూగజీవాలపై ప్రస్తుతం ఉన్న ప్రభావం కంటే 10 నుంచి 100 రెట్ల అధిక ప్రభావం పడుతుందని జూహీ చావ్లా వెల్లడించారు. ఆమె వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు జస్టిస్ సి.హరిశంకర్‌తో కూడిన ధర్మాసనం నిరాకరిస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్టుకు చెందిన మరో బెంచ్‌కు బదిలీ చేసింది. జూన్ 2వ తేదీన ఈ పిటిషన్ విచారణకు రానుంది.
5జీ టెక్నాలజీ వల్ల ఇటు మనుషులకు, అటు మూగజీవాలకు కూడా సురక్షితమని సర్టిఫై చేస్తూ, తమ వాదనను బలపరచే అధ్యయనాలను కూడా జత చేసేలా ప్రతివాదులను ఆదేశించాలని జూహీ చావ్లా పిటీషన్‌లో కోరారు. ఇంతవరకూ ప్రతివాదులు ఎలాంటి అధ్యయనాలు చేయనట్లయితే, ఎలాంటి ప్రైవేటు ప్రయోజనాలను ఆశించకుండా సమర్ధవంతమైన రీసెర్చ్ చేపట్టాలని కూడా పిటిషన్‌లో జూహీ చావ్లా కోరారని ఆమె తరపు న్యాయవాది పేర్కొన్నారు. కాగా జూహీ చావ్లా అటు సినీరంగంలో రాణిస్తూనే పర్యావరణంపై పోరాటం చేస్తున్నారు.
Also Read: