జేపీ న‌డ్డా కాన్వాయ్‌పై దాడి ఘ‌ట‌న‌లో కేంద్రం సీరియ‌స్‌.. బెంగాల్ పోలీసు అధికారుల‌పై కొర‌ఢా

|

Dec 12, 2020 | 7:46 PM

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కాన్వాయ్‌పై రాళ్ల‌దాడి ఘ‌ట‌న‌లో కేంద్రం కొర‌ఢా ఝులిపించింది. దాడి నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం, బెంగాల్ ప్రభుత్వం మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి

జేపీ న‌డ్డా కాన్వాయ్‌పై దాడి ఘ‌ట‌న‌లో కేంద్రం సీరియ‌స్‌.. బెంగాల్ పోలీసు అధికారుల‌పై కొర‌ఢా
Follow us on

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కాన్వాయ్‌పై రాళ్ల‌దాడి ఘ‌ట‌న‌లో కేంద్రం కొర‌ఢా ఝులిపించింది. దాడి నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం, బెంగాల్ ప్రభుత్వం మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. బెంగాల్ లో పని చేస్తున్న అధికారులను డిప్యూటేషన్ పై కేంద్రంలోకి రప్పిస్తూ హోం మంత్రిత్వ శాఖ శనివారం సమన్లు జారీ చేసింది. పశ్చిమబెంగాల్ కేడర్లో విధులు నిర్వహిస్తున్న డైమండ్ హార్బర్ ఎస్పీ భోల్‌నాథ్ పాండే , ప్రెసిడెన్సీ రేంజ్ డీఐజీ ప్ర‌వీణ్ త్రిపాఠ‌, దక్షిణ బెంగాల్ అద‌న‌పు డీజీ రాజీవ్ మిశ్రాల‌ను కేంద్రంలో ప‌ని చేయాల‌ని ఆదేశించింది. న‌డ్డా ప‌ర్య‌ట‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలో విఫ‌ల‌మైనందున ఈ స‌మ‌న్లు జారీ చేస్తున్న‌ట్లు కేంద్రం హోంశాఖ తెలిపింది.

ఆల్ ఇండియా స‌ర్వీస్ అధికారుల‌పై ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే ఈ ఆదేశాలు జారీ చేసిన‌ట్లు కేంద్రంహోం శాఖ వెల్ల‌డించింది. కాగా, సాధార‌ణంగా అఖిల భార‌త స‌ర్వీసు అధికారిని డిప్యుటేష‌న్‌పై కేంద్రంలోకి తీసుకునే స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌మ్మ‌తితో తీసుకుంటారు. అయితే తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌లో కేంద్రం హోంశాఖ బెంగాల్ ప్ర‌భుత్వం స‌మ్మ‌తి లేకుండానే ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఏడుగురి అరెస్టు
కాగా, ఈ దాడి గురువారం జ‌రుగ‌గా, దాడికి సంబంధించిన ఘ‌ట‌న‌లో మూడు ఎఫ్ ఐఆర్‌లు న‌మోదు చేయ‌డంతో పాటు ఏడుగురిని అరెస్టు చేశారు పోలీసులు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారంటూ రెండు సుమోటో ఎఫ్ ఐఆర్‌ల‌ను పోలీసులు న‌మోదు చేశారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పాల్గొనేందుకు ద‌క్షిణ జిల్లాలోని డైమండ్ హార్బ‌ర్‌కు వెళ్తుండ‌గా టీఎంసీ కార్య‌క‌ర్త‌లు న‌డ్డా కాన్వాయ్‌పై రాళ్ల‌తో దాడి చేశారు. అయితే ఈ దాడిని కేంద్రం తీవ్రంగా ప‌రిగ‌ణించింది. ప‌శ్చిమ బెంగాల్‌లో నెల‌కొన్న‌ శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌పై త‌క్ష‌ణ‌మే నివేదిక‌ను అందించాల‌ని గ‌వ‌ర్న‌ర్ ధ‌న్క‌ర్‌ను కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు.