Crime News: ప్రేమించలేదని దారుణం.. యువతిని కారుతో గుద్దిన యువకుడు.. ఆ తర్వాత

| Edited By: Ravi Kiran

Aug 20, 2022 | 4:17 PM

కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో సకలేష్‌పూర్‌కు చెందిన జీఆర్‌ భరత్.. శరణ్య అనే అమ్మాయిని ప్రేమించాడు. ఈవిషయాన్ని యువతికి పలుమార్లు చెప్పగా.. తనకు ఇష్టం లేదని చెప్పింది. దీంతో తన ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో..

Crime News: ప్రేమించలేదని దారుణం.. యువతిని కారుతో గుద్దిన యువకుడు.. ఆ తర్వాత
Karnataka Accident Case
Follow us on

Crime News: ప్రేమించడం తప్పు కాదు.. నేను ప్రేమించాను.. నువ్వు కూడా ప్రేమించాలని వేధించడం తప్పు.. ప్రేమించకపోతే చచ్చిపోతానని కొందరు బెదిరిస్తే.. చంపేస్తానని బెదిరించడం నేటి ఆధునిక యుగంలో చూస్తున్నాం. తానకు నచ్చింది కాబట్టి.. అవతలి వారి ఇష్టాలతో సంబంధం లేకుండా ప్రేమించాల్సిందేనని నిర్భందించడం మూర్ఖత్వం అవుతోంది. ఇలా తన ప్రేమ ప్రతిపాదనను ఒప్పుకోలేదని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు అమ్మాయిపై కారు ఎక్కించి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో సకలేష్‌పూర్‌కు చెందిన జీఆర్‌ భరత్.. శరణ్య అనే అమ్మాయిని ప్రేమించాడు. ఈవిషయాన్ని యువతికి పలుమార్లు చెప్పగా.. తనకు ఇష్టం లేదని చెప్పింది. దీంతో తన ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో శరణ్యని హత్య చేయాలని ప్లాన్ వేశాడు. చివరికి కారుతో యాక్సిడెంట్ చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని డిసైడ్ అయ్యాడు. దీంతో ఈనెల 3వ తేదీన నడుచుకుంటూ ఆఫీసుకు వెళ్తున్న శరణ్యను వెనుక నుంచి కారులో వస్తూ ఆమెని ఢీకొట్టి.. శరీరంపై నుంచి కారును ఎక్కించాడు. తరువాత వాహనాన్ని కంట్రోల్ చేయలేక గూడ్స్ ఆటో, ద్విచక్రవాహనాలను, బస్సు ఢీకొట్టాడు. దీంతో కారును వదిలి భరత్ అక్కడినుంచి పరారయ్యాడు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శరణ్యని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న యువతి ఈనెల4వ తేదీన మృతి చెందింది. తన కుమార్తె మృతిపై శరణ్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది రోడ్డు ప్రమాదమా, లేదా కావాలని యాక్సిడెంట్ చేశారా అనేదానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యాక్సిడెంట్ చేసిన భరత్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా.. తానే యాక్సిడెంట్ చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన లవ్ ప్రపోజల్ ను రిజక్ట్ చేయడంతో చంపేశానని తెలిపాడు. మొదట కత్తితో నరికి చంపాలనుకున్న నిందితుడు భరత్.. తర్వాత ప్లాన్ మార్చుకున్నాడు. మైసూరులో కారును అద్దెకు తీసుకుని.. యాక్సిడెంట్ పేరుతో శరణ్యను కారుతో ఢీకొట్టాడు. పోలీసుల విచరాణలో హత్య కుట్ర బయటపడటంతో నిందితుడు భరత్ కటకటాల వెనక్కి వెళ్లాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..