Jharkhand: కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దం.. హేమంత్ సోరెన్ ప్రమాణం ఎప్పుడంటే..

|

Nov 24, 2024 | 9:29 PM

జార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దమయ్యింది. ఈనెల 28వ తేదీన సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు హేమంత్‌ సోరెన్‌. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్‌ ఆయన్ను ఆహ్వానించారు.

Jharkhand: కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దం.. హేమంత్ సోరెన్ ప్రమాణం ఎప్పుడంటే..
Hemant Soren
Follow us on

జార్ఖండ్‌లో ఈనెల 28వ తేదీన కొత్త సర్కార్‌ కొలువుతీరబోతోంది. జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ నాలుగోసారి సీఎం పగ్గాలు చేపట్టబోతున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సంతోష్‌ గంగ్వార్‌తో ఆయన భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని సోరెన్‌ గవర్నర్‌ను కోరారు. తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 56 సీట్లలో గెలుపొంది ఇండియా కూటమి ఘనవిజయం సాధించింది. హేమంత్‌సోరెన్‌తో పాటు మిత్రపక్షాల నేతలు కూడా గవర్నర్‌తో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌, ఆర్జేడీ నేతలతో భేటీ అయ్యారు హేమంత్‌ సోరెన్‌.. తన మంత్రివర్గంలో కాంగ్రెస్‌తో పాటు ఆర్జేడీ ఎమ్మెల్యేలకు చోటు కల్పించబోతున్నారు సోరెన్‌. జార్ఖండ్‌లో కాంగ్రెస్‌ పరిశీలకులుగా ఉన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గులాం అహ్మద్‌ మీర్‌ , తారిఖ్‌ అన్వర్‌తో హేమంత్ సోరెన్‌ చర్చలు జరిపారు.

గవర్నర్‌ను కలిసి తాను రాజీనామా లేఖ ఇచ్చినట్టు చెప్పారు హేమంత్‌ సోరెన్‌. ఈనెల 28వ తేదీన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందని వెల్లడించారు.

కూటమి తరపున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరామని.. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయ్యిందని హేమంత్ సోరెన్ తెలిపారు. అందులో భాగంగా గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చానని తెలిపారు.


కాగా.. కాంగ్రెస్‌ పార్టీ నాలుగు మంత్రి పదవులు కావాలని కోరుతోంది. జార్ఖండ్‌లో ఇండియా కూటమి ఎమ్మెల్యేల శాసనసభా పక్ష నేతగా హేమంత్‌ సోరెన్‌ను ఎన్నుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో JMM 34 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 16 స్థానాల్లో, ఆర్జేడీ 4 , సీపీఐ ఎంఎల్‌ రెండు స్థానాల్లో గెలిచాయి.

జార్ఖండ్‌లో వరుసగా రెండు సార్లు ఏ పార్టీ కూడా విజయం సాధించలేదు. కాని 24 ఏళ్ల ఆ రికార్డును బద్దలుకొట్టి హేమంత్‌ సోరెన్‌ వరుసగా రెండోసారి సీఎ పగ్గాలు చేపట్టబోతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..