ధన్ బాద్ జడ్జి మర్డర్ పై ‘సిట్’ దర్యాప్తు వేగవంతం.. 53 హోటళ్లలో గాలింపు.. 243 మంది అనుమానితుల ఇంటరాగేషన్

| Edited By: Phani CH

Aug 02, 2021 | 9:40 AM

ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ మర్డర్ పై 'సిట్' పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. రాష్ట్రంలోని 53 హోటళ్లలో గాలింపు జరిపారు.

ధన్ బాద్ జడ్జి మర్డర్ పై సిట్ దర్యాప్తు వేగవంతం.. 53 హోటళ్లలో గాలింపు.. 243 మంది అనుమానితుల ఇంటరాగేషన్
Uttam Anand Murder Case
Follow us on

ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ మర్డర్ పై ‘సిట్’ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. రాష్ట్రంలోని 53 హోటళ్లలో గాలింపు జరిపారు. 243 మంది అనుమానితులను ఇంటరాగేట్ చేశారు. గత శనివారం రాత్రి నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 17 మందిని అరెస్టు చేశామని, 250 ఆటోలను సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఆటోల యజమానులు తమ డాక్యుమెంట్లను చూపలేకపోయారన్నారు. ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణపై ప్రధాన పతార్థి పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉమేష్ మంజీని, ఎస్ఐ ఆదర్శకుమార్ ని సస్పెండ్ చేసినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఓ టెంపో చోరీకి గురైందని తెలిసినా ఉమేష్ సరైన చర్యలు తీసుకోలేదని, అలాగే సీసీటీవీ ఫుటేజీలో ఓ టెంపో జడ్జిని ఢీ కొన్న దృశ్యాల తాలూకు వీడియో చూసినప్పటికీ ఎస్ఐ ఆదర్శకుమార్ కూడా ఇన్వెస్టిగేట్ చేయలేదని వారన్నారు. డ్యూటీలో వీరిద్దరూ నిర్లక్ష్యం వహించారని తేలిందన్నారు. కాగా నిన్న ధన్ బాద్ లోని సర్క్యూట్ హౌస్ లో ఏడీజీ సంజయ్ ఆనంద్ ఆధ్వర్యాన సుదీర్ఘ సమావేశాలు జరిగాయి. అనంతరం జడ్జి హత్య జరిగినట్టు చెబుతున్న క్రైమ్ స్పాట్ కి చేరుకొని సీన్ రీక్రియేట్ చేయడానికి యత్నించారు.

గత బుధవారం న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్ జాగింగ్ చేస్తుండగా వెనుక నుంచి ఓ టెంపో ఆయనను ఢీ కొని వేగంగా వెళ్ళిపోయింది. సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినా దీనిపై వారు చురుకుగా ఇన్వెస్టిగేట్ చేయడంలేదని ఉత్తమ్ ఆనంద్ తండ్రి ఆరోపించారు. తన కుమారుడిని రాజకీయ ప్రత్యర్థులే హత్య చేశారని ఆయన అన్నారు. ఈ కేసుపై సుప్రీంకోర్టు తనకు తానుగా విచారణ చేపట్టింది. మరోవైపు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Silver Spoon: లక్ అంటే ఇదీ.. 90పైసలకు కొన్న స్పూన్ అతడిని లక్షాధికారిని చేసింది.. ఎక్కడంటే

Viral Video: అమ్మ బాబోయ్.. మొసలితో ముసలావిడ.. వీడియో చూస్తే గుండె గుభేల్..