
పాకిస్తాన్ తన దుష్ట కార్యకలాపాలను కొనసాగిస్తోంది. గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్తాన్ డ్రోన్‌లు తరచుగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఆదివారం (జనవరి 18) సాంబాలో భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో మరోసారి అనుమానాస్పద డ్రోన్‌లు కనిపించడం విస్తృత ఆందోళనకు కారణమైంది.
ఆదివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దులోని రామ్‌గఢ్ సెక్టార్‌లో డ్రోన్లు కనిపించాయి. ఆ డ్రోన్ భారత భూభాగంపై కొన్ని నిమిషాల పాటు సంచరించినట్లు సమాచారం. గణతంత్ర దినోత్సవానికి కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో, డ్రోన్ కార్యకలాపాలు కొనసాగడం తీవ్రమైన భద్రతా సమస్యగా పరిగణిస్తున్నారు.
శనివారం తెల్లవారుజామున, సాంబా జిల్లాలోని రామ్‌గఢ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖకు సమీపంలో డ్రోన్ కార్యకలాపాలు కనిపించాయి. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పాకిస్తాన్ వైపు నుండి ఒక డ్రోన్ లాంటి వస్తువు కనిపించింది. రామ్‌గఢ్ ప్రాంతంలోని కాండ్రాల్ గ్రామంపై చాలా సేపు సంచరించింది. డ్రోన్ కార్యకలాపాలను గమనించిన తర్వాత, భద్రతా దళాలు గాలింపు చేపట్టారు. మాదకద్రవ్యాలు, ఆయుధాలు వంటివి గాలి ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్నారన్న అనుమానంతో ఆ ప్రాంతంలో సోదాలు ప్రారంభించాయి. అయితే, ఆపరేషన్ సమయంలో నేరారోపణకు సంబంధించిన ఏదీ కనుగొనలేదని ఆర్మీ అధికారులు తెలిపారు.
#WATCH | J&K | Exchange of fire between security forces and terrorists breaks out in the Chatroo area of Kishtwar. Police Operation underway.
(Visuals deferred by unspecified time) https://t.co/pewmoQVIgl pic.twitter.com/QkT1yTFHI7
— ANI (@ANI) January 18, 2026
ఇదిలావుంటే, జనవరి 9న, సాంబాలోని ఘగ్వాల్‌లోని పలోరా గ్రామంలో పాకిస్తాన్ నుండి డ్రోన్ ద్వారా జారవిడిచిన ఆయుధాల నిల్వను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. స్వాధీనం చేసుకున్న వాటిలో రెండు పిస్టల్స్, మూడు మ్యాగజైన్‌లు, 16 రౌండ్లు, ఒక గ్రెనేడ్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిఘా సంస్థలను పూర్తి అప్రమత్తంగా ఉంచారు. డ్రోన్ కార్యకలాపాలను తీవ్రంగా పరిగణించి, ఈ ప్రాంతం అంతటా సెర్చ్ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. సరిహద్దు నిఘాను పెంచారు. సున్నితమైన ప్రాంతాలలో అదనపు దళాలను మోహరించారు.
మరోవైపు, జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో భద్రతా దళాలు – ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. సింగ్‌పోరా ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. చత్రులోని సింగ్‌పోరా అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఈ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు అనుమానిస్తున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ ఉగ్రవాదులు జైష్-ఎ-మొహమ్మద్ సంస్థతో అనుబంధంగా ఉండవచ్చని భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..