రోడ్డుపై పడివున్న పెర్ఫ్యూమ్ బాటిల్‌.. వాసన చూద్దామని ఓపెన్‌ చేస్తే బీభత్సం..

అంటే.. ఈసారి కొత్త తరహాలో పేలుళ్లకు పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారు. గత ఏడాది మే 24న వైష్ణోదేవికి వెళ్తున్న యాత్రికుల బస్సుపై జరిగిన దాడిలో తన ప్రమేయం ఉందని విచారణలో ఆరిఫ్ ఒప్పుకున్నట్లు దిల్‌బాగ్ తెలిపారు.

రోడ్డుపై పడివున్న పెర్ఫ్యూమ్ బాటిల్‌.. వాసన చూద్దామని ఓపెన్‌ చేస్తే బీభత్సం..
Perfume Bomb
Follow us

|

Updated on: Feb 03, 2023 | 7:47 AM

రోడ్డుమీద పడివున్న పెర్ఫ్యూమ్ బాటిల్ చూసిన ఓ వ్యక్తి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. బాటిల్‌ చూసేందుకు కొత్తగా, నిండుగా ఉండటంతో… వాసన ఏమిటో తెలుసుకోవాలని మూత తెరిచి చూశాడు.. అంతే, ఒక్కసారిగా అక్కడి పరిసరాలు భయానకంగా మారిపోయాయి. అతడు ఓపెన్‌ చేసిన పెర్ఫ్యూమ్ బాటిల్ ఒక్కసారిగా పేలిపోయింది. పెర్ఫ్యూమ్‌ బాటిల్‌ సృష్టించిన విధ్వంసానికి అక్కడి పరిసరాలు వణికిపోయాయి. ఈ దారుణ ఘటన జమ్మూ- కశ్మీర్‌లో చోటు చేసుకుంది. కాశ్మీర్‌లో భద్రతా బలగాలను పక్కదారి పట్టించేందుకు సరిహద్దు అవతలి నుంచి కొత్త మార్గాల ద్వారా ఇలాంటి ‘పెర్ఫ్యూమ్ బాంబ్’లను దిగుమతి చేసుకుంటున్నారు ఉగ్రమూకలు. ఘటనకు సంబంధించి..కశ్మీర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా మారువేశంలో పనిచేస్తున్న మిలిటెంట్ ఆరిఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి పెర్ఫ్యూమ్ బాంబును స్వాధీనం చేసుకున్నారు. జనవరి 21న జమ్మూకశ్మీర్‌లోని నర్వాల్‌లో ఉగ్రవాదులు రెండు ఐఈడీలను పేల్చారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ఘటనపై పోలీసులు విచారణ చేస్తుండగా ఆరీఫ్‌ దొరికాడు. పెర్ఫ్యూమ్ బాటిళ్లలో ప్యాక్ చేసిన ఐఈడీ పేలుడు పదార్థాల వల్లే జంట పేలుళ్లు సంభవించాయని దర్యాప్తులో తేలింది.

పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఆరీఫ్‌తో సన్నిహితంగా మెలిగినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసు డీజీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. ఆరిఫ్ నుంచి పెర్ఫ్యూమ్ బాటిల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది IEDలతో లోడ్ చేయబడిందిగా గుర్తించారు. బాటిల్ తెరవగానే పేలిపోతుంది. ఇలాంటి పేలుడు పదార్థాలపై పోలీసుల ప్రత్యేక బృందం పరిశోధన ప్రారంభించిందని దిల్‌బాగ్ తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటి సంప్రదాయేతర పద్దతులను తీవ్రవాదులు ప్రయోగిస్తారని పోలీసులు ఆచరణాత్మకంగా భావిస్తున్నారు. దీనిని అడ్డుకునేందుకు పోలీసులు సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు.

ఇంతకుముందెన్నడూ పేలుడు పదార్థాలతో ఇలాంటి పెర్ఫ్యూమ్ బాటిళ్లను పేల్చిన ఘటన ఎప్పుడూ జరగలేదని జమ్మూ-కశ్మీర్ పోలీస్ చీఫ్ చెప్పారు. అంటే.. ఈసారి కొత్త తరహాలో పేలుళ్లకు పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారు. గత ఏడాది మే 24న వైష్ణోదేవికి వెళ్తున్న యాత్రికుల బస్సుపై జరిగిన దాడిలో తన ప్రమేయం ఉందని విచారణలో ఆరిఫ్ ఒప్పుకున్నట్లు దిల్‌బాగ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్