Earthquake: ఒకేసారి నాలుగు భూకంపాలు.. పరుగులు పెట్టిన ప్రజలు.. ఎక్కడంటే

|

Dec 18, 2023 | 10:10 PM

గంట వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించింది. దాంతో ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. రెక్టార్ స్కెల్ పై భూకంపం తీవ్రత 10 కి.మీ లోతు అలాగే 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. కార్గిల్, లడఖ్‌ కేంద్రంగా తూర్పు 76.74°,  ఉత్తరం 33.15° డిగ్రీల వద్ద మధ్యాహ్నం 3:48 గంటలకు భారీ భూకంపం సంభవించింది.

Earthquake: ఒకేసారి నాలుగు భూకంపాలు.. పరుగులు పెట్టిన ప్రజలు.. ఎక్కడంటే
Earthquake
Follow us on

డిసెంబరు 18, సోమవారం నాడు జమ్మూ కాశ్మీర్ , లడఖ్‌లో భూమి కంపించింది. గంట వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించింది. దాంతో ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. రెక్టార్ స్కెల్ పై భూకంపం తీవ్రత 10 కి.మీ లోతు అలాగే 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. కార్గిల్, లడఖ్‌ కేంద్రంగా తూర్పు 76.74°,  ఉత్తరం 33.15° డిగ్రీల వద్ద మధ్యాహ్నం 3:48 గంటలకు భారీ భూకంపం సంభవించింది.

కిష్త్వార్‌లో సాయంత్రం 4:18 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం.. రెక్టార్ స్కెల్ మీద 3.6 తీవ్రతతో రికార్డ్ అయ్యింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) డేటా ప్రకారం, భూకంప కేంద్రం  ఉత్తరానికి 33.37°, తూర్పుకు 76.57° మధ్య గుర్తించారు. అంతకు ముందు 3.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. భూకంప సంఘటన సాయంత్రం 4:01 గంటలకు సంభవించింది.

సాయంత్రం 4:25 గంటలకు, జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో మరో భూకంపం సంభవించింది, ఇది 5.1 తీవ్రతతో , భూకంప కేంద్రం 76.7188 ° E, 33.1832 ° N వద్ద 16 కి.మీ లోతుతో నమోదైంది. దాంతో ప్రజలు ఇల్లువదిలి రోడ్లపైకి పరుగులు తీశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అలాగే తదుపరి భూకంప కార్యకలాపాలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే, ఈ భూకంపంలో ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారిక వర్గాలు తెలిపాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..