ప్రధాని మోదీని విమర్శిస్తూ పోస్టర్ అతికిస్తే తనపై కేసు పెడతారా అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాంరమేష్ ఢిల్లీ పోలీసులపై మండిపడ్డారు. దమ్ముంటే నాపై చర్య తీసుకోండి చూద్దాం అన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ విషయంలో మోదీ అనుసరిస్తున్న విధానాన్ని విమర్శిస్తూ ఢిల్లీలో పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. దీనిపై స్పందించిన పోలీసులు 25 మందిపై ఎఫ్ఐఆర్ లు దాఖలు చేశారు. ప్రధానిని విమర్శిస్తూ పోస్టర్ ఏర్పాటు చేస్తే అది నేరమవుతుందా ? ఈ దేశం మోదీ పీనల్ కోడ్ పై నడుస్తోందా ? ఈ కోవిడ్ పాండమిక్ సమయంలో ఢిల్లీ పోలీసులు ఉద్యోగాల్లేక ఉసూరుమంటున్నారా అని జైరాంరమేష్ ప్రశ్నించారు. రేపు తన ఇంటి ప్రహరీ గోడపై కూడా పోస్టర్లు పెడతానని, చూద్దురు గాని రండి అని ఆయన పోలీసులను, హోమ్ మంత్రి అమిత్ షాను ఉద్దేశించి ట్వీట్ చేశారు. మా పిల్లలకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్ ని విదేశాలకు ఎందుకు పంపారు అని సెటైరికల్ గా ప్రధానిని విమర్శిస్తూ ఇటీవల నగరంలో కొంతమంది వ్యక్తులు పోస్టర్లను అతికించారు. అయితే ఇవి ప్రధానమంత్రిని విమర్శించేవిగా ఉన్నాయని భావించిన పోలీసులు డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ లోని కొన్ని చట్టాల కింద కేసులు ఫైల్ చేశారు.
ఇప్పటికే దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఏర్పడగా ఇప్పుడు ఈ పోస్టర్స్ అధికార బీజేపీకి తలనొప్పిగా మారాయి.
మరిన్ని చదవండి ఇక్కడ : Ward boy rapes Covid patient video: హాస్పిటల్ లో కరోనా పేషేంట్ పై వార్డ్ బాయ్ లైంగిక దాడి వైరల్ వీడియో..
Raghu Rama Krishna Raju : రఘురామకృష్ణంరాజుకు హై కోర్ట్ షాక్ బెయిల్ నిరాకరణ..!(వీడియో).