Covid-19: జైపూర్‌ పాఠశాలలో కరోనా కలకలం.. 11 మంది విద్యార్థులకు పాజిటివ్‌.. స్కూల్‌ మూసివేత..

|

Nov 23, 2021 | 3:26 PM

కరోనా రెండో దశ ఉధృతి అనంతరం మెల్లమెల్లగా అన్ని రంగాలు కోలుకుంటున్నాయి. ఇందులో భాగంగా విద్యారంగం కూడా క్రమంగా గాడిన పడుతోంది

Covid-19: జైపూర్‌ పాఠశాలలో కరోనా కలకలం.. 11 మంది విద్యార్థులకు పాజిటివ్‌.. స్కూల్‌ మూసివేత..
Covid 19
Follow us on

కరోనా రెండో దశ ఉధృతి అనంతరం మెల్లమెల్లగా అన్ని రంగాలు కోలుకుంటున్నాయి. ఇందులో భాగంగా విద్యారంగం కూడా క్రమంగా గాడిన పడుతోంది. కొన్ని చోట్ల ఆన్‌లైన్‌ తరగతులు కూడా నిర్వహిస్తున్నా చాలావరకు స్కూళ్లు, పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే కరోనా నిబంధనలతో పాఠశాలలు నిర్వహిస్తున్నప్పటికీ.. మహమ్మారి మాత్రం విద్యార్థులను, ఉపాధ్యాయులను వెంటాడుతూనే ఉంది. తాజాగా రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని ఓ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. మొత్తం 11 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలను మూసేశారు. కొన్ని రోజుల క్రితం జైపూర్‌లోని మహారాజా సవాయి మాన్‌సింగ్‌ గురుకులంలో కూడా పెద్ద ఎత్తున పాజిటివ్‌ కేసులు బయటపడిన సంగతి తెలిసిందే.

కరోనా ప్రభావంతో దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు పాఠశాలలు, కళాశాలలు మూత పడిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లో సెప్టెంబర్‌ మొదటివారంలో స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు తెరచుకున్నాయి. మొదట 50 శాతం విద్యార్థులతో నిర్వహించగా దీపావళి తర్వాత 100 శాతం విద్యార్థులతో తరగతులకు అనుమతినిచ్చారు. అయితే దురదృష్టవశాత్తూ అప్పటి నుంచే పాఠశాలల్లో వరుసగా విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. ఈ సందర్భంగా స్కూళ్లలో కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని, టీచర్లందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. ఇటీవల తెలంగాణ ఖమ్మం జిల్లాలోని వైరా బాలికల గురుకులంలో కూడా కరోనా విజృంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాలలోని మొత్తం 27 మంది విద్యార్థులు వైరస్‌ బారిన పడ్డారు.

Also Read:

Gas Cylinder Blast: తమిళనాడులో భారీ పేలుడు.. కుప్ప కూలిన మూడు ఇళ్లు.. శిథిలాల కింద జనాలు..

Vodafone Idea Tariff Hike: కస్టమర్లకు షాకివ్వనున్న వొడాఫోన్ ఐడియా.. భారం కానున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు.. ఎప్పటి నుంచో తెలుసా?

Grape Wine From Sea: ఆ వైన్ రుచిని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు ఇలా చేస్తారట..