Shahabuddin: కరోనాతో ఆర్జేడీ మాజీ ఎంపీ షాహబుద్దీన్ మృతి.. ధ్రువీకరించిన తీహార్ జైలు డీజీ..

RJD MP Mohammad Shahabuddin dies of COVID-19: క‌రోనావైర‌స్‌ బారిన పడి రాష్ట్రీయ జనతాద్ నేత (ఆర్జేడీ) మాజీ ఎంపీ మ‌హ్మ‌ద్ షాహబుద్దీన్ శ‌నివారం ఉద‌యం

Shahabuddin: కరోనాతో ఆర్జేడీ మాజీ ఎంపీ షాహబుద్దీన్ మృతి.. ధ్రువీకరించిన తీహార్ జైలు డీజీ..
Shahabuddin Dies Of Covid 19

Updated on: May 01, 2021 | 1:46 PM

Shahabuddin dies of COVID-19: క‌రోనావైర‌స్‌ బారిన పడి రాష్ట్రీయ జనతాద్ నేత (ఆర్జేడీ), మాజీ ఎంపీ మ‌హ్మ‌ద్ షాహబుద్దీన్ శ‌నివారం ఉద‌యం మ‌ర‌ణించారు. అయితే ఈ వార్త‌ల‌ను మొదట పుకార్లుగా చిత్రికరించినప్పటికీ.. ఆ తర్వత తీహార్ జైలు డీజీ సందీప్ గోయెల్.. షాహబుద్దీన్ మృతి చెందినట్లు శనివారం మధ్యాహ్నం ధ్రువీకరించారు. హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న షాహాబుద్దీన్ ఏప్రిల్ 20న కోవిడ్ బారిన పడినట్లు గోయెల్ ప్రకటించారు. ఆ తర్వాత అతని పరిస్థితి విషమించడంతో.. దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చేర్చినట్లు వెల్లడించారు.

కాగా.. కోవిడ్ బారిన పడిన షాహాబుద్దీన్‌కు సరైన చికిత్స అందించాలని బుధవారం ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని, తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. అతన్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని వెల్లడించింది. కోర్టు ఆదేశాల మేర‌కు షాహాబుద్దీన్ కు చికిత్స అందించేందుకు రెండు రోజుల క్రితం డీడీయూ ఆసుపత్రిలో చేర్చగా.. శ‌నివారం తెల్ల‌వారు జామున‌ షాహాబుద్దీన్ తుది శ్వాస విడిచిన‌ట్లు పేర్కొంటున్నారు.

బీహార్‌లోని సివాన్‌కు చెందిన మహ్మద్ షాహాబుద్దీన్ డబుల్ మర్డర్ కేసులో నిందితుడిగా తేలి తిహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ఆయన దాదాపు 14 సంవత్సరాల నుంచి తీహార్ జైలులోనే ఉన్నారు. ఆయనపై ఆయుధ చట్టం కేసు కూడా నమోదైంది. ఈ కేసులో బీహార్ కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టుగా వెళ్లగా కోర్టు బీహార్ ప్రభుత్వం నుంచి నివేదికను కోరింది. ఈ క్రమంలోనే ఆయన కరోనాతో మరణించారు.

Also Read:

Corona Virus: కరోనా వైరస్ మీ శరీరంలోకి ప్రవేశించినట్లు లంగ్స్ ముందే అలెర్ట్ చేస్తాయంటున్న శాస్త్రజ్ఞులు.. ఎలా తెలుసుకోవాలంటే..!

Etela Rajender: వివరణ తీసుకోకుండా విచారణకు ఆదేశించారు.. కుట్ర చేస్తున్నదెవరో త్వరలో బయట పడుతుందన్న ఈటల