ISRO: ఇస్రో వరుస రాకెట్ ప్రయోగాలతో బిజీగా వుంది.. ఇటీవలే చంద్రయాన్.3 ని తీసుకెళ్లే LVM3 M4 ప్రయోగాన్ని సక్సెస్ చేసిన ఇస్రో ఇపుడు PSLV ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేసింది.. అది కూడా చంద్రాయన్ ప్రయోగం జరిగిన 12 రోజుల్లోనే.. తిరుపతి జిల్లా శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి రాకెట్ ప్రయోగ వేదిక నుండి ప్రయోగం జరగనుంది. ఈనెల 26న ఇస్రో శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి ..సి 56 రాకెట్ ను ప్రయోగించనున్నారు.. ఇది పూర్తిగా కమర్షియల్ లాంచ్ గా ఇస్రో చెబుతోంది. ప్రయోగం ద్వారా సింగపూర్ మరియు ఇజ్రాయిల్ దేశాలకు సంబంధించిన కమర్షియల్ రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ కమర్షియల్ రాకెట్ ప్రయోగంలో మొత్తం ఏడు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్న ఇస్రో శాస్త్రవేత్తలు.
సింగపూర్ ,ఇస్రాయిల్ దేశాలకు చెందిన హమ్ డీఎస్ -ఎస్ ఏ ర్ అనే 351.9 కేజీలు బరువు కలిగిన భూ పరిశీలన ఉపగ్రహం ఈ ప్రయోగంలో ప్రధానమైనది. అదేవిధంగా దీనితో పాటు 23. 58 కేజీలు బరువు ఉన్న ఆర్కేడ్ సాటిలైట్ మరియు 23 కేజీలు బరువు ఉన్న వెలాక్ -ఎ ఎమ్ సాటిలైట్ మరియు 12.8 కేజీలు బరువు ఉన్న ఆర్బు12 స్పైడర్ ఉపగ్రహాలతో పాటు మరో మూడు నానో ఉపగ్రహాలు ,గెలుసియా-2 ,స్కూప్-2, మరియు నులియన్ అనే నానో ఉపగ్రహాలను ఇందులో అమర్చి ఇస్రో శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి- సి 56 రాకెట్ ప్రయోగం రూపొందించిన PSLV. C 56 రాకెట్ ప్రయోగం ద్వారా విదేశీ ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్ లోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.