
చంద్రుని దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 దిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అక్కడు లూనార్ నైట్ ప్రారంభం కానుంది. భూ కాలమానం ప్రకారం చూసుకుంటే ఇది 14 రోజుల వరకు కొనసాగుతుంది. అయితే ఈ సమయంలో చంద్రుడి దక్షిణ ధృవం వద్ద ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. అలాగే లూనార్ నైట్ సమయంలో అక్కడ సూర్య కాంతి అనేదే ఉండదు. దీని ప్రభావం వల్ల విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ పనిచేసేందుకు విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి సోలార్ ప్యానెల్స్ పనిచేయవు. అయితే ఈ నేపథ్యంలో ల్యాండర్, రోవర్‌ను స్లీప్ మోడ్‌లో పెట్టేందుకు ఇస్రో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా శ్రీ హరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం ఆదిత్య ఎల్1ను కూడా విజయవంతంగా ప్రయోగించిన సంగతి అందరికీ తెలిసిందే.
Aditya-L1 started generating the power.
The solar panels are deployed. ఇవి కూడా చదవండిThe first EarthBound firing to raise the orbit is scheduled for September 3, 2023, around 11:45 Hrs. IST pic.twitter.com/AObqoCUE8I
— ISRO (@isro) September 2, 2023
ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 పై ఇస్రో ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ ఇప్పటికీ కూడా విజయవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే చంద్రుడిపైకి వచ్చే రాత్రిని తట్టుకునేందుకు ల్యాండర్, రోవల్‌లను స్లీప్ మోడ్‌లో ఉంచే ప్రక్రియను ఒకటి నుంచి రెండు రోజుల్లోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. అలాగే రోవర్ కూడా ఇప్పటిదాకా చంద్రుడి ఉపరితలంపై దాదాపు 100 మీటర్ల దూరం వరకు ప్రయాణించిందని తెలిపారు. ఇదిలా ఉండగా చంద్రుడి దక్షిణ ధృవంపై ప్రజ్ఞాన్ రోవర్ ప్రయణించినటువంటి మార్గా్న్ని కూడా ఇస్రో షేర్ చేసింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే దక్షిణ ధృవంపై తిరిగి లూనార్ డే ప్రారంభమైన తర్వాత ల్యాండర్, రోవర్‌లు ఎంతవరకు తిరిగి పని చేయగలను అన్న విషయం ప్రశ్నగానే మిగిలిపోయింది. లూనార్ డే మొదలయ్యాకా కూడా ల్యాండర్, రోవర్‌లు సక్రమంగా పనిచేసినట్లైతే ఇస్రో మరో చరిత్ర సృష్టించినట్లే. ఇందుకోసం శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే.. చంద్రునిపై సల్ఫర్, కాల్షియం, ఐరన్ సహా పలు ఖనిజాలు కనుగొన్న సంగతి తెలిసిందే.
Chandrayaan-3 Mission:
🏏Pragyan 100*
Meanwhile, over the Moon, Pragan Rover has traversed over 100 meters and continuing. pic.twitter.com/J1jR3rP6CZ
— ISRO (@isro) September 2, 2023
Chandrayaan-3 Mission:
In-situ scientific experiments continue …..
Laser-Induced Breakdown Spectroscope (LIBS) instrument onboard the Rover unambiguously confirms the presence of Sulphur (S) in the lunar surface near the south pole, through first-ever in-situ measurements.… pic.twitter.com/vDQmByWcSL
— ISRO (@isro) August 29, 2023