ఇరాన్‌-ఇజ్రాయిల్‌ యుద్ధం..! భారత రాయబార కార్యాలయం నుంచి కీలక ప్రకటన

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఆయా దేశాల్లోని భారతీయ పౌరుల భద్రతపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్‌లోని భారతీయులకు సహాయం అందించేందుకు అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు, వాట్సాప్ నంబర్లు, టెలిగ్రామ్ లింక్‌ను భారత రాయబార కార్యాలయం అందుబాటులో ఉంచింది.

ఇరాన్‌-ఇజ్రాయిల్‌ యుద్ధం..! భారత రాయబార కార్యాలయం నుంచి కీలక ప్రకటన
Iran Vs Israel

Updated on: Jun 15, 2025 | 7:10 PM

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం తీవ్రమవుతున్న నేపథ్యంలో రెండు దేశాలలోని భారతీయ పౌరుల భద్రతపై భారతదేశం ఆందోళన చెందుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున వైమానిక దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయులను రక్షించడానికి, సహాయం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం వివిధ హెల్ప్‌లైన్‌లను ప్రారంభించింది. ఇరాన్‌లో చాలా మంది భారతీయులు ఉన్నారు. అక్కడి భారతీయులు ఆందోళన చెందవద్దని, వారు ఇచ్చిన సూచనలను పాటించాలని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఎక్స్‌ వేదికగా వరుస ట్వీట్‌లు చేసిన రాయబార కార్యాలయం ఖాతా వివిధ హెల్ప్‌లైన్ నంబర్‌లను, టెలిగ్రామ్ లింక్‌ను అందించింది.

“ఇరాన్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఇరాన్‌లోని భారత పౌరులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలి. వారు ఇరాన్‌లో అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలి. రాయబార కార్యాలయం సోషల్ మీడియా పేజీలలో ప్రచురించబడిన సమాచారాన్ని వారు గమనించాలి” అని అడ్వైజరీ పేర్కొంది.

అత్యవసర సంప్రదింపు నంబర్లు

+98 9128109115
+98 9128109109

వాట్సాప్ నంబర్లు

+98 9010144557
+98 9015993320
+91 8086871709

ముఖ్యమైన సమాచారం కోసం టెలిగ్రామ్ ఛానల్

భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు పరిస్థితిపై నవీకరణలు, సలహాలను అందించడానికి ఒక టెలిగ్రామ్ లింక్‌ను రూపొందించింది. ప్రతి ఒక్కరూ ఈ లింక్‌ను అనుసరించాలని సూచించారు. ఇరాన్ నుండి దాడి జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా భారతదేశం ఇరాన్ సైనిక, అణు సౌకర్యాలపై వైమానిక దాడులు నిర్వహించింది. దీనికి ప్రతిస్పందనగా, ఇరాన్ వివిధ ఇజ్రాయెల్ నగరాలపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .