AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐసిస్ ఉగ్రవాదిపై కొనసాగుతున్న విచారణ.. వెలుగులోకి కీలక విషయాలు

ఐసిస్‌కి చెందిన అబ్దుల్ యూసుఫ్‌ అనే ఉగ్రవాదిని ఢిల్లీలో భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే

ఐసిస్ ఉగ్రవాదిపై కొనసాగుతున్న విచారణ.. వెలుగులోకి కీలక విషయాలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 22, 2020 | 2:51 PM

Share

Terrorist Abdul Yusuf: ఐసిస్‌కి చెందిన అబ్దుల్ యూసుఫ్‌ అనే ఉగ్రవాదిని ఢిల్లీలో భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అతడిని 8 రోజుల పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌తో పాటు వివిధ దర్యాప్తు సంస్థలు అతడిని విచారిస్తున్నాయి. ఇక వీరి దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌కి చెందిన యూసుఫ్‌, సోషల్ మీడియా ద్వారా ఐసిస్ పట్ల ఆకర్షితుడైనట్లు పోలీసులు గుర్తించారు. రద్దీ ప్రాంతాలు, బీజేపీ నేతలు లక్ష్యంగా యూసుఫ్‌ దాడులకు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. ఒంటరిగానే బాంబు దాడులు, కాల్పులతో విధ్వంసం సృష్టించేందుకు పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలో బలరాంపూర్‌లోని అతడి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. యూసుఫ్ రెక్కీ నిర్వహించిన ప్రాంతాల్లోనూ భద్రతా బలగాల సోదాలు నిర్వహించారు. ఇక యూసుఫ్‌కి పేలుడు పదార్థాలు, మరణాయుధాలు సమకూర్చిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మరోవైపు యూసుఫ్ అరెస్టుతో ఢిల్లీ సహా పరిసర రాష్ట్రాల్లో హై-అలర్ట్ విధించారు. దేశవ్యాప్తంగా మరికొందరు ఐసిస్ పట్ల ఆకర్షితులయ్యారని నిఘా సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సిరియా, పాకిస్తాన్ దేశాల్లోని ఐసిస్ కమాండర్ల ద్వారా వీరికి ఆదేశాలు అందుతున్నట్లు అనుమానిస్తోన్న అధికారులు.. ఆ మేరకు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Read More:

కరోనాను తగ్గిస్తోన్న ఆయింట్‌మెంట్‌.. యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం

దర్శకుడిని మనువాడిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ భామ

Follow Us
వినాయకుడిని నిమజ్జనం చేస్తూ.. నదిలో పడిపోయిన యువకుడు
వినాయకుడిని నిమజ్జనం చేస్తూ.. నదిలో పడిపోయిన యువకుడు
బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్.. ఖాతాదారులకు బిగ్ అలర్ట్..
బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్.. ఖాతాదారులకు బిగ్ అలర్ట్..
పితృ పక్షంలో ఈ రోజుల్లో శ్రాద్ధం చేయకూడదట.. ఈ నియమాలు తెలుసుకోండి
పితృ పక్షంలో ఈ రోజుల్లో శ్రాద్ధం చేయకూడదట.. ఈ నియమాలు తెలుసుకోండి
ప్రతీ టర్మ్‌లోనూ తప్పని ఉపయాగం.. ఎవరెవరికి దక్కినట్టు ఉపయోగం?
ప్రతీ టర్మ్‌లోనూ తప్పని ఉపయాగం.. ఎవరెవరికి దక్కినట్టు ఉపయోగం?
శ్రీకాళహస్తీశ్వరాలయంలో హీరోయిన్ డింపుల్ ప్రత్యేక పూజలు.. వీడియో
శ్రీకాళహస్తీశ్వరాలయంలో హీరోయిన్ డింపుల్ ప్రత్యేక పూజలు.. వీడియో
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు
ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద.. 20 గేట్లు ఎత్తి నీటి విడుదల
ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద.. 20 గేట్లు ఎత్తి నీటి విడుదల
రేబిస్‌తో రెండేళ్ల బాలుడి మరణం..
రేబిస్‌తో రెండేళ్ల బాలుడి మరణం..
భర్తను ప్రాణంగా ప్రేమించే 3 నక్షత్రాల మహిళలు.. వీరు భార్యగా వస్తే
భర్తను ప్రాణంగా ప్రేమించే 3 నక్షత్రాల మహిళలు.. వీరు భార్యగా వస్తే
ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి జీతాలు
ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి జీతాలు