కరోనాను తగ్గిస్తోన్న ఆయింట్‌మెంట్‌.. యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ని కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

కరోనాను తగ్గిస్తోన్న ఆయింట్‌మెంట్‌.. యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం
Follow us

| Edited By:

Updated on: Aug 22, 2020 | 2:11 PM

ointment to kill Covid 19: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ని కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అందులో కొన్ని వ్యాక్సిన్‌లు ట్రయల్స్‌లో విజయాన్ని సాధిస్తున్నాయి. అయినా కరోనాకు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ ఓ న్యూస్‌ని చెప్పింది. కరోనా సహా పలు వైరస్‌లను సంహరించే గుణం తమ ఆయింట్‌మెంట్‌కు ఉందని, అందుకు యూఎస్ఎఫ్‌డీఏ ఆమోదం లభించిందని ఆ కంపెనీ తెలిపింది. అంతేకాదు దీనిని కొనుగోలు చేసేందుకు వైద్యుడు సిఫార్సు చేసే ఎలాంటి మందుల చిట్టీ అవసరం లేదని వెల్లడించింది. ఆ ఆయింట్‌మెంట్‌ పేరు ఏంటంటే ఏపీటీ టీ3ఎక్స్‌.

టీ3ఎక్స్‌తో చికిత్స చేసిన 30 సెకన్ల తరువాత ఎలాంటి వైరస్ కనిపించలేదని పలు నివేదికల్లో తెలిసిందని అడ్వాన్స్‌డ్‌ పెనెట్రేషన్ టెక్నాలజీ సంస్థ స్థాపకుడు, సీఈవో డాక్టర్ బ్రియాన్ హ్యూబర్ వెల్లడించారు. ముక్కు ద్వారా సంక్రమించే కరోనా వైరస్ నుంచి తప్పించుకునేందుకు ఇది కచ్చితంగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. కరోనా వైరస్‌తో పాటు ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లపై ఈ ఆయింట్‌మెంట్ ప్రభావవంతంగా పనిచేస్తుందని.. సెకన్లల వ్యవధిలోనే వైరస్‌ విస్తరిస్తే శక్తిని ఇది నిర్వీర్యం చేస్తుందని కంపెనీ వెల్లడించింది. ముక్కులోకి పీల్చుకోవడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని దాదాపుగా అడ్డుకోవచ్చునని వెల్లడించింది. ప్రయోగశాలలో నిర్దేశిత వాతావరణంలో 99 శాతం లోడ్‌ తగ్గిందని.. బ్యాక్టీరియా, ఫంగస్‌ల నుంచి రక్షణ కోసం దీనిని ఉపయోగించవచ్చునని తెలిపింది.

Read More:

దర్శకుడిని మనువాడిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ భామ

కంగనాపై సుశాంత్‌ ఫ్యామిలీ లాయర్ కీలక వ్యాఖ్యలు