PM Narendra Modi: దేశంలో మరో లాక్‌డౌన్..? 13న సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..

|

Jan 11, 2022 | 6:24 PM

PM Modi meeting with CMs: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గతంలో ఎన్నడు లేని విధంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో

PM Narendra Modi: దేశంలో మరో లాక్‌డౌన్..? 13న సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
Pm Narendra Modi
Follow us on

PM Modi meeting with CMs: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గతంలో ఎన్నడు లేని విధంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కేవలం పది రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య 10 వేల నుంచి లక్షన్నరకు పైగా నమోదవుతున్నాయి. దీంతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం అలజడి రేపుతోంది. ఒమిక్రాన్ (Omicron) కేసులు సైతం రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్కసారిగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఆదివారం సాయంత్రం వైద్యనిపుణులు, మంత్రులతో సైతం సమీక్ష నిర్వహించారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో పలు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచనలు చేశారు. భారీగా పెరుగుతున్న కరోనా (Coronavirus) కేసుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్, ఆసుపత్రుల్లో సౌకర్యాలు, ఔషధాలు, ఆక్సిజన్ తదితర అంశాలపై సూచనలు చేశారు. జిల్లా స్థాయిలో తగిన ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచాలని.. యుక్తవయస్సులోని పిల్లలకు టీకా డ్రైవ్‌ను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న కరోనా కేసులు, తీసుకోవాల్సిన చర్యలపై గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. వర్చువల్ ద్వారా జరిగే ఈ సమావేశంలో సమావేశంలో కేసుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, లాక్‌డౌన్, తదితర విషయాలపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు.

2020లో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుంచి ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో అనేక సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రుల సూచనలను పరిగణలోకి తీసుకోని ప్రధాని మోదీ పలు ఆదేశాలు సైతం ఇచ్చారు. అయితే.. దేశంలో విపరీతంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు చూస్తుంటే.. దేశవ్యాప్తంగా మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే భయాందోళన నెలకొంది. కోవిడ్ కేసులు పెరగడం ఆందోళన కలిగించే విషయం అయినప్పటికీ.. లాక్‌డౌన్ విధించడం వల్ల ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలాఉంటే.. భారతదేశంలో సోమవారం 1,68,063 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 3,58,75,790కి చేరుకుంది. దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 4,461 కి చేరింది. ప్రస్తుతం కరోనా క్రియాశీల కేసులు సంఖ్య 8,21,446కి పెరిగింది. ఇది 208 రోజులలో అత్యధికం. తాజాగా.. 277 మరణించారు. వీరితో కలిపి మరణించిన వారి సంఖ్య 4,84,213కి చేరుకుంది.

Also Read:

Good News: ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త.. ఫ్రీ రేషన్ పథకం మార్చి వరకు పెంపు..

UP Assembly Election 2022: ఎన్నికల ముందు బీజేపీకి భారీ షాక్.. ఎస్పీలో చేరిన ఆ పార్టీ మంత్రి..