IRCTC: లగ్జరీ క్రూజ్‌ లైనర్‌లను నడపనున్న ఐఆర్‌సీటీసీ… 5 రాత్రులు, 6 పగళ్ల ప్రయాణానికి టికెట్‌ ధర ఎంతంటే.

|

Sep 09, 2021 | 6:53 AM

IRCTC: క్రూజ్‌ లైనర్‌లు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది విదేశాలు. విలాసవంతమైన ప్రయాణాలకు ఇవి పెట్టింది పేరు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ లగ్జరీ పడవలను ఉపయోగిస్తుంటారు. ఇదిలా ఉంటే..

IRCTC: లగ్జరీ క్రూజ్‌ లైనర్‌లను నడపనున్న ఐఆర్‌సీటీసీ... 5 రాత్రులు, 6 పగళ్ల ప్రయాణానికి టికెట్‌ ధర ఎంతంటే.
Follow us on

IRCTC: క్రూజ్‌ లైనర్‌లు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది విదేశాలు. విలాసవంతమైన ప్రయాణాలకు ఇవి పెట్టింది పేరు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ లగ్జరీ పడవలను ఉపయోగిస్తుంటారు. ఇదిలా ఉంటే దేశంలో తొలిసారి స్వదేశీ క్రూజ్‌ లైనర్‌ సేవలను ప్రారంభించేందుకు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ సేవలను సెప్టెంబర్‌ 18 నుంచి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ బుధవారం అధికారికంగా తెలిపింది.

ఈ సేవలను వాటర్‌వేస్‌ లీజర్‌ టూరిజంకు చెందిన కార్డెలియా క్రూజెస్‌ అనే ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యంతో ఐఆర్‌సీటీసీ ఈ సేవలను ప్రారంభించనుంది. కార్డెలియా క్రూజెస్‌ దేశంలో లగ్జరీ క్రూజ్‌ లైనర్‌గా పేరు సంపాదించుకుంది. ఇందులో భాగంగా గోవా, డయ్యు, లక్షద్వీప్‌, కోచి, శ్రీలంక తదితర ప్రాంతాలకు ఈ లగ్జరీ క్రూజర్‌లను నడపనున్నారు. తొలుత ముంబయి కేంద్రంగా సంస్థ కార్యకలాపాలను ప్రారంభించనుంది.

వచ్చే ఏడాది మే తర్వాత క్రూజన్‌ను చెన్నైకు తరలించి అనంతరం అక్కడి నుంచి శ్రీలంక, కొలంబో, గాలే, ట్రింకోమాలీ, జాఫ్నా తదితర ప్రాంతాలకు పర్యాటక సేవలు అందిస్తామని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. టూర్‌ ప్యాకేజ్‌లో భాగంగా ముంబయి నుంచి లక్షద్వీప్‌నకు 5 రాత్రులు, 6 పగళ్ల ప్రయాణానికి ఒక మనిషికి రూ.49,745 నుంచి టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. ఇక టికెట్లను ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ అయిన irctc tourism.comలో ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చని ఐఆర్‌సీటీసీ తెలిపింది.

Also Read: Bigg Boss 5 Telugu: అందరూ అందరే.. ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య రచ్చ.. సెన్స్ లేదా అంటూ ఆ బ్యూటీ ఫైర్..

Farooq Abdullah: ఆఫ్ఘానిస్తాన్ కొత్త పాలనపై సంచలన వ్యాఖ్యలు.. చిక్కుల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఇంతకీ ఎమన్నారంటే..?

Krithi Shetty: ‘బేబమ్మా.. వాట్‌ ఇజ్‌ దిస్‌ అమ్మా’.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న కృతీ శెట్టి లేటెస్ట్‌ ఫొటోలు..