చార్ ధామ్ యాత్రలో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. దేశవిదేశాల్లో ఉన్న హిందువులు ఇందుకోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. హిమాలయాల్లో 3553 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ఆలయానికి చేరుకునే మార్గం కూడా ఎంతో కష్టంతో కూడుకుని ఉంటుంది. ఈ ఏడాది భక్తుల సందర్శనార్థం ఏప్రిల్ 25 నుంచి ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నట్లు సమాచారం. ఇక ఆలయానికి చేరుకునే మార్గం ఎంతో క్లిష్టంగా ఉంటుంది.
దీంతో ఆలయ సందర్శనానికి వచ్చే చిన్నారులు, వృద్ధులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వారి కోసమే ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించింది. గతంలో నుంచే ప్రభుత్వం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ఏటా ఉత్తరాఖండ్ ‘సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ (UCADA)’ ఈ సేవలను నిర్వహించే హెలికాప్టర్ సంస్థలను నుంచి టెండర్లను ఆహ్వానిస్తుంది.
ఈసారి కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్‌లో వెళ్లాలనుకునే వారు ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ హెలియాత్ర పేరిట ప్రత్యేక పోర్టల్‌ను (https://heliyatra.irctc.co.in/) ప్రారంభించింది. ఇప్పటికే ట్రయల్ రన్స్‌ను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్ చేరానులకునే వారు ముందుగా ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ బోర్డు దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్ వెబ్ పోర్టల్, టూరిస్ట్ కేర్ ఉత్తరఖండ్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే.. +91 8394833833 మొబైల్ నెంబర్‌కు ‘Yatra’ అని వాట్సప్ మెసేజ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..