IRCTC Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ విజయవాడ మీదుగా ఈ నెల 30 వరకు ప్రత్యేక రైళ్లు

|

Jun 10, 2021 | 6:16 PM

IRCTC Special Trains: కరోనా సృష్టించిన విలయంలో ప్రజలతో పాటు అనేక సంస్థలు ఆర్ధికంగా నష్టపోయాయి. వాటిలో ఒకటి రైల్వే శాఖ. లాక్ డౌన్రై నేపథ్యంలో పలు రైళ్లను..

IRCTC Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ విజయవాడ మీదుగా ఈ నెల 30 వరకు ప్రత్యేక రైళ్లు
Trains
Follow us on

IRCTC Special Trains: కరోనా సృష్టించిన విలయంలో ప్రజలతో పాటు అనేక సంస్థలు ఆర్ధికంగా నష్టపోయాయి. వాటిలో ఒకటి రైల్వే శాఖ. లాక్ డౌన్రై నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసింది ఆ శాఖ. అయితే రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు రైల్వే అధికారులు. ఏపీలోని విజయవాడ మీదుగా ఈ నెల 30వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను పలు ప్రాంతాలకు నడుపుతున్నామని రైల్వే అధికారులు ప్రకటించారు.

రైళ్ల వివరాలు :

రైలు నంబరు 02449-02450 షాలిమార్‌-సికింద్రాబాద్‌ మధ్య నడిచే ప్రత్యేక రైలు జూన్ 9, 16, 23, 30 తేదీల్లో షాలిమార్‌ లో మధ్యాహ్నం 12.20 కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.55 కి సికింద్రాబాద్‌ కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జూన్ 11, 18, 25, జులై 2వ తేదీల్లో ఇదే రైలు సికింద్రాబాద్‌ లో ఉదయం 4 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.05కి షాలిమార్‌ చేరుతుంది.

ట్రైన్ నంబరు 02469-02470 హౌరా-యశ్వంత్‌ పూర్‌ మధ్య నడుస్తుంది. ఈ ప్రత్యేక రైలు జూన్ 10, 17, 24వ తేదీల్లో హౌరాలో మధ్యాహ్నం 12.40 కి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.40కి యశ్వంత్‌ పూర్‌ కు చేరుకుంటుంది. ఇదే రైలు 13, 20, 27వ తేదీల్లో యశ్వంత్‌ పూర్‌ లో ఉదయం 5.15 కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.25 కి హౌరాకు చేరుకుంటుంది.

రైలు నంబరు 03253-03254 పాట్నా-బనాస్‌వాడీ మధ్య నడిచే వీకెండ్ స్పెషల్ ట్రైన్ ను జూన్ 10వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు.

Also Read: శివుడు బ్రహ్మహత్యా దోషాన్ని స్నానమాచరించి పోగొట్టుకున్న పవిత్ర క్షేత్రం ఎక్కడో తెలుసా (photo gallery)