చిదంబరానికి ఊరట.. సీబీఐ రివ్యూ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

| Edited By: Pardhasaradhi Peri

Jun 04, 2020 | 7:49 PM

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి బెయిలు మంజూరు కావడాన్ని  సవాలు చేస్తూ.. సీబీఐ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది..

చిదంబరానికి ఊరట.. సీబీఐ రివ్యూ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
Follow us on

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి బెయిలు మంజూరు కావడాన్ని  సవాలు చేస్తూ.. సీబీఐ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓపెన్ కోర్టులో మౌఖిక (ఓరల్) విచారణ జరగాలంటూ దాఖలైన ‘ద్దరఖాస్తును’ తిరస్కరిస్తున్నట్టు కోర్టు పేర్కొంది. తాము ఈ పిటిషన్ ను, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలించామని, బెయిలుకు సంబంధించిన ఉత్తర్వులను మళ్ళీ సమీక్షించాలన్న అభ్యర్థనలో అందుకు అనుగుణమైన ఆధారాలు లేవని భావించామని న్యాయమూర్తులు తెలిపారు. ఈ కేసులో గత అక్టోబరు 2 న చిదంబరానికి బెయిలు లభించింది. ఆయన దేశం విడిచి వెళ్లే ప్రమాదం ఉందని, బెయిలు ఆర్డర్ ను తిరిగి పరిశీలించాలని సీబీఐ కోరింది. అటు ఇదే కేసులో గత డిసెంబరులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ను కూడా కోర్టు కొట్టివేసింది.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం రూ. 10 లక్షల ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు వఛ్చిన సంగతి విదితమే.