ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరానికి స్వల్ప ఊరట

| Edited By:

Aug 23, 2019 | 2:00 PM

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి కాస్త ఊరట లభించింది. ఈ కేసులో ఈడీ నుంచి రక్షణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం.. చిదంబరానికి ముందుస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే ఇదే వ్యవహారంలో తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ మాత్రం ఆగష్టు 26కు వాయిదా వేసింది. అయితే ఐఎన్ఎక్స్‌ మీడియా కేసులో ముందస్తు బెయిల్ కోసం చిదంబరం అనేక ప్రయత్నాలు […]

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరానికి స్వల్ప ఊరట
Follow us on

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి కాస్త ఊరట లభించింది. ఈ కేసులో ఈడీ నుంచి రక్షణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం.. చిదంబరానికి ముందుస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే ఇదే వ్యవహారంలో తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ మాత్రం ఆగష్టు 26కు వాయిదా వేసింది.

అయితే ఐఎన్ఎక్స్‌ మీడియా కేసులో ముందస్తు బెయిల్ కోసం చిదంబరం అనేక ప్రయత్నాలు చేశారు. ఆయన పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో బుధవారం సాయంత్రం ఆయనను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. హైడ్రామా అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. విచారణ కోసం చిదంబరాన్ని ఈ నెల 26 వరకు సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అప్పగించిన విషయం తెలిసిందే.