Govt of India: కేంద్రం సంచలన నిర్ణయం.. ఇక నుంచి ఆ వివరాలన్నీ అధికారులకు ఇవ్వాల్సిందే..

|

Aug 10, 2022 | 9:30 AM

Govt of India: అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ప్రయాణికులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ప్రతీ విమానయాన సంస్థ..

Govt of India: కేంద్రం సంచలన నిర్ణయం.. ఇక నుంచి ఆ వివరాలన్నీ అధికారులకు ఇవ్వాల్సిందే..
Plane
Follow us on

Govt of India: అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ప్రయాణికులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ప్రతీ విమానయాన సంస్థ.. అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలను కస్టమ్స్ అధికారులకు ఇవ్వాల్సిందే. ప్రయాణికుల పేరు, కాంటాక్ట్ నంబర్, పేమెంట్స్ తదితర వివరాలన్నింటినీ కస్టమ్స్ అధికారులకు అందించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ జారీ చేయడం వెనుక కీలక ఉద్ధేశం ఉంది. దేశంలో గోల్డ్, డ్రగ్స్ అక్రమ రవాణా విపరీతంగా పెరిగిపోతోంది. అదే సమయంలో నేరగాళ్లు సునాయాసంగా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కస్టమ్స్ యాక్ట్ కింద నేరగాళ్ల గుర్తింపు, విచారణకు ఉపయోగించుకోవడంతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు, దేశాలతోనూ ఈ వివరాలను పంచుకోనుంది కేంద్ర ప్రభుత్వం. తాజా నిర్ణయంతో అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలు సేకరిస్తున్న 60 దేశాల జాబితాలో భారత్ కూడా చేరినట్లయ్యింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..