Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money9: దేశాన్ని కలవర పెడుతున్న ఆహార కొరత.. ఈ ఖరీఫ్‌లో మరింత తగ్గనున్న ఉత్పత్తి..

Money9: దేశంలో ఈ ఏడాది ఖరీఫ్ కాలంలో పంటల ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు పెద్దగా ప్రభావం..

Money9: దేశాన్ని కలవర పెడుతున్న ఆహార కొరత.. ఈ ఖరీఫ్‌లో మరింత తగ్గనున్న ఉత్పత్తి..
Rice Millers
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 10, 2022 | 9:34 AM

Money9: దేశంలో ఈ ఏడాది ఖరీఫ్ కాలంలో పంటల ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు పెద్దగా ప్రభావం చూపకపోవడమే ఇందుకు కారణం అని చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో అధికంగా పంటలు పండించే రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రభావం లేకపోవడం, వర్షాలు సరిగా పడకపోవడంతో.. ఉత్పత్తి తగ్గనుందని భావిస్తున్నారు. ఈ సారి ఖరీఫ్ పంటల సాగు తగ్గితే.. గత ఆరేళ్లలో ఇదే తొలిసారి అవుతుంది. దీనికి ముందు 2015-16 సంవత్సరంలో కూడా దేశంలో ఖరీఫ్ పంటల ఉత్పత్తి పడిపోయింది. ఆ తర్వాత వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఖరీఫ్‌ పంటల ఉత్పత్తి ఏటా పెరుగుతూ వస్తోంది.

అయితే, ఈసారి పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో రుతుపవనాలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. తక్కువ వర్షాల కారణంగా వరి విస్తీర్ణం 13 శాతం కంటే తక్కువగా ఉంది. దీని వల్ల 10 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి పడిపోయే అవకాశం ఉంది. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో మొత్తం 129.6 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి జరిగింది. ఇందులో ఒక్క ఖరీఫ్ సీజన్‌లో 111 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి అయ్యింది.

వరి, ఇతర పంటల ఉత్పత్తిపై ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే.. మొబైల్‌లో వెంటనే Money9 యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా సమగ్ర సమాచారం పొందవచ్చు. Money9 అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు .

మనీ9 అంటే ఏమిటి? Money9 OTT యాప్ ఇప్పుడు Google Play, iOSలో అందుబాటులో ఉంది. వ్యక్తిగత ఫైనాన్స్‌కు సంబంధించిన ప్రతి సమాచారం ఏడు భాషల్లో అందిస్తోంది. ఇదొక ప్రత్యేకమైన ప్రయోగం. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి, పన్ను, ఆర్థిక విధానాలు మొదలైన వాటి గురించిన సమగ్ర సమాచారం వివరించడం జరిగింది. ఇది మీకు అన్ని విధాలుగా ఉపయుక్తంగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం.. Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి, ఆర్థిక అవగాహనను పెంచుకోండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆర్ఎస్ఎస్ భారతీయ సంస్కృతి వట వృక్షంః ప్రధాని మోదీ
ఆర్ఎస్ఎస్ భారతీయ సంస్కృతి వట వృక్షంః ప్రధాని మోదీ
కిర్రాక్ లుక్‌తో స్టన్నింగ్ ఫీచర్స్‌తో ఈవీ కార్లు..త్వరలోనే లాంచ్
కిర్రాక్ లుక్‌తో స్టన్నింగ్ ఫీచర్స్‌తో ఈవీ కార్లు..త్వరలోనే లాంచ్
DC vs SRH: మిచెల్ స్టార్క్ పాంచ్ పటాకా.. 163కే హైదరాబాద్ ఆలౌట్
DC vs SRH: మిచెల్ స్టార్క్ పాంచ్ పటాకా.. 163కే హైదరాబాద్ ఆలౌట్
నాగ్‌పూర్‌లో ప్రధాని మోదీ పర్యటన హైలెట్స్...
నాగ్‌పూర్‌లో ప్రధాని మోదీ పర్యటన హైలెట్స్...
పక్కా వెజిటేరియన్ ఫుడ్స్‌.. టేస్ట్ మాత్రం నాన్వెజ్‌లా ఎందుకుంటాయ్
పక్కా వెజిటేరియన్ ఫుడ్స్‌.. టేస్ట్ మాత్రం నాన్వెజ్‌లా ఎందుకుంటాయ్
జ‌గ్గారెడ్డి వార్ ఆఫ్ ల‌వ్ పోస్టర్ రిలీజ్..
జ‌గ్గారెడ్డి వార్ ఆఫ్ ల‌వ్ పోస్టర్ రిలీజ్..
నిండా ముంచిన డేటింగ్‌ యాప్‌.. రూ.6.5 కోట్ల మోసం..షాకింగ్ విషయాలు
నిండా ముంచిన డేటింగ్‌ యాప్‌.. రూ.6.5 కోట్ల మోసం..షాకింగ్ విషయాలు
వామ్మో ఇదెక్కడి వింత.. తలలేని కోడి ఏకంగా 18 నెలలు బతికింది..!
వామ్మో ఇదెక్కడి వింత.. తలలేని కోడి ఏకంగా 18 నెలలు బతికింది..!
స్పిరిట్ సినిమా పై అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..
స్పిరిట్ సినిమా పై అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..
ఏఐ వచ్చినా ఈ ఉద్యోగాలకు ఢోకా లేదు.. తేల్చిచెప్పిన బిల్ గేట్స్..!
ఏఐ వచ్చినా ఈ ఉద్యోగాలకు ఢోకా లేదు.. తేల్చిచెప్పిన బిల్ గేట్స్..!