Harsh Goenka: కాఫీ ధర రూ. 250, రెండు ఇడ్లీలు మాత్రం రూ. 3.50.. ఆసక్తికరమైన ట్వీట్‌ చేసిన హర్షగోయెంకా.

|

Sep 03, 2021 | 8:30 AM

Harsh Goenka: సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే వారిలో ప్రముఖ వ్యాపారవేత్త హర్షగోయెంకా ఒకరు. నిత్యం ట్విట్టర్‌ వేదికగా ఆసక్తికరమైన పోస్టులు చేస్తూ అందరిలోనూ...

Harsh Goenka: కాఫీ ధర రూ. 250, రెండు ఇడ్లీలు మాత్రం రూ. 3.50.. ఆసక్తికరమైన ట్వీట్‌ చేసిన హర్షగోయెంకా.
Harsh Goenka
Follow us on

Harsh Goenka: సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే వారిలో ప్రముఖ వ్యాపారవేత్త హర్షగోయెంకా ఒకరు. నిత్యం ట్విట్టర్‌ వేదికగా ఆసక్తికరమైన పోస్టులు చేస్తూ అందరిలోనూ ఆసక్తిరేకెత్తిస్తుంటారు హర్ష. ఆయన జీవిత అనుభవాలతో పాటు సమాజంలో జరిగే అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన తమిళనాడులోని ఓ ఇడ్లీ సెంటర్‌ గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతంలో ఓ ఇడ్లీ సెంటర్‌ను నడిపిస్తున్నారు. ఇక్కడ రెండు ఇడ్లీలు కేవలం రూ. 3.50 అందిస్తున్నారు.

ఇదే విషయాన్ని నెటిజన్లతో పంచుకున్న హర్షగోయెంకా ట్వీట్ చేస్తూ.. ‘తమిళనాడలోని ఈరోడ్‌లో ఒక ఇడ్లీ మార్కెట్‌ ఉంది. ఇక్కడ రోజుకు 2వేలకుపైగా ఇడ్లీలు అమ్ముతారు. రెండు ఇడ్లీలు కేవలం రూ. 3.50 మాత్రమే ఒకవేళ చట్నీ, సాంబార్‌ కావాలనుకుంటనే రూ. 6.50 చెల్లించాలి. ఇండియా చాలా ఆసక్తికరమైన దేశం. ఇక్కడ స్టార్‌బక్స్‌ కాఫీ ధర రూ. 250 ఉంటుంది. కానీ రెండు రుచికరమైన ఇడ్లీలు మాత్రం రూ. 3.50కే లభిస్తాయి’ అంటూ ఆలోచింపజేసే క్యాప్షన్‌ రాసుకొచ్చారు హర్ష.

డబ్బుతో కొనలేనివి కూడా ఉంటాయి..

ఇక  జీవిత సారాన్ని తెలుపుతూ హర్షాగోయెంకా చేసిన ఓ ట్వీట్‌ నెటిజన్లను ఆలోజింపచేస్తోంది. జీవితంలో డబ్బు ప్రాధాన్యత గురించి ట్వీట్ చేసిన ఆయన.. ‘డబ్బులు ఉంటే జీవితం సౌకర్యవంతంగా ఉంటుంది. దాంతో ఎన్ని వస్తువులైనా కొనొచ్చు. కానీ, డబ్బుతో కూడా కొనలేనివీ కొన్ని ఉంటాయి. వాటిని కోల్పోకూడదు. ఒకసారి వాటిని కోల్పోతే తిరిగి పొందలేము’అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు.

Also Read: Google Pay FD: బ్యాంకు ఖాతా ఓపెన్‌ చేయకుండానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయవచ్చు.. ఎలాగంటే..!

Pawan Kalyan Birthday: పవన్‌పై అభిమానాన్ని ఈ ఫ్యాన్‌ ఎలా చాటుకున్నాడో చూడండి.. ఏకంగా 24 గంటలపాటు శ్రమించి.

Illegal Affair: భర్త, ఇద్దరు పిల్లలను వదిలి వెళ్లిన భార్య.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య.. విషయం తెలిసిన జంట ఏం చేసిందంటే..?