Indo-US Army Drills చైనా గుండెల్లో వణుకు పుట్టేలా ఇండో-యూఎస్ సంయుక్త వైమానిక విన్యాసాలు..

|

Apr 25, 2023 | 6:24 AM

పశ్చిమబెంగాల్‌ కలైకుండా ఎయిర్ బేస్‌ వినీలాకాశంలో లోహ విహంగాలు హంగామా సృష్టించాయి. శబ్దవేగాన్ని మించిన స్పీడ్‌తో దూసుకుపోతూ ఆకాశంలో సోనిక్ బూమ్‌ను సృష్టించాయి. ఏప్రిల్ 10న ప్రారంభమైన కోప్ ఇండియా-2023 విన్యాసాలు ఈరోజు ముగిశాయి.

Indo-US Army Drills చైనా గుండెల్లో వణుకు పుట్టేలా ఇండో-యూఎస్ సంయుక్త వైమానిక విన్యాసాలు..
Us Indian Army Drills
Follow us on

పశ్చిమబెంగాల్‌ కలైకుండా ఎయిర్ బేస్‌ వినీలాకాశంలో లోహ విహంగాలు హంగామా సృష్టించాయి. శబ్దవేగాన్ని మించిన స్పీడ్‌తో దూసుకుపోతూ ఆకాశంలో సోనిక్ బూమ్‌ను సృష్టించాయి. ఏప్రిల్ 10న ప్రారంభమైన కోప్ ఇండియా-2023 విన్యాసాలు ఈరోజు ముగిశాయి.

పశ్చిమ బెంగాల్‌లోని కలైకుండా ఎయిర్‌బేస్‌లో భారత్- అమెరికా వైమానిక విన్యాసాల చివరిరోజున యుద్ధ విమానాలు సృష్టించిన శబ్దంతో ఆకాశం దద్దరిల్లింది. భారత్ తరపున ఈ విన్యాసాల్లో ఎస్‌యు-30, జాగ్వార్, తేజస్, రఫెల్ విమానాలు పాలుపంచుకుంటున్నాయి. అమెరికా తరపున ఎఫ్-15 ఫైటర్ జెట్స్, విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఈ విన్యాసాలతో పాకిస్తాన్, చైనాలకు భారత్ సవాల్ చేసినట్లైంది. కలైకుండా ఎయిర్ బేస్ నుంచి చైనా సరిహద్దు ప్రాంతం 900 కి.మీ దూరంలో ఉంది.

సుఖోయ్-30, రఫేల్, జాగ్వార్, తేజస్ యుద్ధ విమానాలు రన్ వేపై విన్యాసాలకు సిద్ధమవుతున్నాయి. మన పొరుగుదేశం చైనా మనదేశం పట్ల దుందుడుకుగా వ్యవహరిస్తోంది. ఈ విన్యాసాలతో చైనాకు చెక్ చెప్పినట్లవుతుంది. సుఖోయ్-30 భారత్‌వైమానిక దళంలో అత్యంత కీలకమైనది. ఇటువంటివి మనదగ్గర 270వరకు ఉన్నాయి. వీటిలో 220 విమానాలు దేశీయ కంపెనీ హెచ్‌ఏఎల్ అసెంబ్లింగ్ చేసింది.

రఫేల్ విమానం.. ఫ్రాన్స్ నుంచి వీటిని మన దేశం కొనుగోలుచేసింది. గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే సౌలభ్యాన్ని రఫేల్ కలిగివుంది. ఇది సింగిల్ సీటర్ మల్టీ రోల్ ఫైటర్ జెట్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..