శాంతి..శాంతి.. భారత్-చైనా మధ్య చర్చల్లో ఇదే అజెండా .

భారత-చైనా దేశాలు ప్రస్తుతానికి శాంతిమంత్రం పఠించాయి. వివిధ ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు..

శాంతి..శాంతి.. భారత్-చైనా మధ్య చర్చల్లో ఇదే అజెండా .
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 07, 2020 | 1:18 PM

భారత-చైనా దేశాలు ప్రస్తుతానికి శాంతిమంత్రం పఠించాయి. వివిధ ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు అంగీకరించాయి. శనివారం లడఖ్ లోని మోల్డో ప్రాంతంలో ఇరు దేశాల సైనికాధికారుల మధ్య సుహృద్భావ పూరిత వాతావరణంలో చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావాలంటే బోర్డర్ లో శాంతి నెలకొనాల్సిందేనని ఉభయ పక్షాలూ ఏకాభిప్రాయానికి వఛ్చినట్టు ఈ శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత సైనిక దళాల తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరఫున టిబెట్ మిలిటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ ఈ సంప్రదింపుల్లో పాల్గొన్నారు. ఇండో-చైనా దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి  70 సంవత్సరాలు అయిన సందర్భంగా  వీటిని మరింత పటిష్టపరచుకునేందుకు సాధ్యమైనంత త్వరగా ఓ పరిష్కారానికి రావాలని ఈ మీటింగ్ లో అభిప్రాయపడినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఈ సమావేశానికి ముందు గత శుక్రవారం.. విదేశాంగ శాఖ సంయుక్త  కార్యదర్శి నవీన్ శ్రీవాత్సవ, చైనా విదేశాంగ శాఖ డైరెక్టర్ జనరల్…. వూ జియాంగ్ హో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించుకున్నారు.