Indira Gandhi: అప్పట్లో నాటి అమెరికా అధ్యక్షుడిపై అందరి ముందే అసహనం ప్రదర్శించిన ఇందిరా…. 

ఒకరు ప్రపంచ దేశాలకు పెద్దన్న లాంటి అమెరికా అధ్యక్షుడు.. ట్రంప్.. ఇంకొకరు అత్యంత శక్తివంతమైన రష్యాతో ఢీ అంటే ఢీ అంటున్న  జెలెన్‌స్కీకి. వాళ్లిద్దరి మధ్య మాటల యుద్దం ప్రపంచ దేశాల్నినివ్వెరపాటకు గురి చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ మ‌ధ్య.. వాషింగ్ట‌న్ డీసీలోని వైట్‌హౌస్‌లో వాడీ వేడీ సంభాషణ జరిగింది.

Indira Gandhi: అప్పట్లో నాటి అమెరికా అధ్యక్షుడిపై అందరి ముందే అసహనం ప్రదర్శించిన ఇందిరా.... 
Indira Gandhi - Richard Nixon

Edited By: Ram Naramaneni

Updated on: Mar 04, 2025 | 12:44 PM

ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య జరిగింది సంభాషణ కంటే వాగ్వాదం అనడం కరెక్ట్ ఏమో. అంతలా మాటలు విసురుకున్నారు. దీంతో కీలకమైన ఖనిజ ఒప్పందంపై సంతకం చేయకుండానే.. వైట్‌హౌస్‌ నుంచి జెలెన్‌స్కీ వెనుదిర‌గాల్సి వ‌చ్చింది. ఓవ‌ల్ ఆఫీసులో ఆ ఇద్ద‌రు నేత‌లు మీడియా ముందే ఒకరిపై మరొకరు ఫైర్ అయ్యారు. రూమ్ అంతా ఉన్న జర్నలిస్టుల ముందే ఆ ఇద్దరు నేత‌లు మాట‌ల యుద్ధం కొన‌సాగింది.  దేశాధినేతల మధ్య.. వివిధ అంశాలపై అభిప్రాయ బేధాలు ఉండటం సహజమే. వాటి పరిష్కారానికి దౌత్య పరమైన నిర్ణయాలు, భేటీలు జరుగుతూ ఉంటాయి. అయితే, ఇద్దరు దేశాధినేతలు భేటీ అయినప్పుడు మాట మాట అనుకోవడం ఒకరిపై ఒకరు సీరియస్ అవ్వడం చాలా అరుదు.  భారత మాజీ ప్రధాని.. దివంగత ఇందిరాగాంధీ విషయంలోనూ ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.

బంగ్లాదేశ్‌ విషయంపై భారత్‌, పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తోన్న సమయం అది.  ఆ సమయంలోనే 1971 నవంబరులో అప్పటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ యూఎస్‌కు వెళ్లారు. ఆమెకు స్వాగతం పలుకుతూ చేసిన ప్రసంగంలో  అప్పటి అమెరికా ప్రెసిడెంట్.. రిచర్డ్‌ నిక్సన్‌  బిహార్‌ వరదలను ప్రస్తావిస్తూ బాధితుల సానుభూతి తెలుపుతూ మాట్లాడారు. అయితే, తూర్పు పాకిస్థాన్‌ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ సైన్యం అరాచకాలను భరించలేక భారత్‌కు పోటెత్తి వస్తోన్న శరణార్థుల గురించి ఆయన ప్రస్తావించకపోవడంతో ఇందిరాగాంధీ నొచ్చుకున్నారు. ఆ తర్వాత తాను ఇచ్చిన ప్రసంగంలో.. మనిషి సృష్టించిన విపత్తు ఇన్ని ప్రాణాలు బలిగొంటున్నా.. కొందరు ఏం పట్టనట్లు ఉండటం మంచిది కాదంటూ.. తన ఆవేదనను వెళ్లగక్కారు. అయితే తర్వాత వైట్ హౌస్‌కి వచ్చిన ఇందిరాగాంధీని 45 నిమిషాల పాటు వెయిట్ చేయించి..  నిక్సన్‌ రీవేంజ్ తీర్చుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..