
కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు.. శత్రువు కదలికలను పసిగట్టడం చాలా కష్టమైంది మనకు. శాటిలైట్స్ ఇమేజెస్ సపోర్ట్ ఉంటే బాగుండేదనిపించింది. అమెరికాకు ఆ టెక్నాలజీ ఉండడంతో.. కాస్త సాయం చేయండని అడిగాం. ‘మీకా.. మేమా.. శాటిలైట్ సపోర్ట్ ఇవ్వడమా.. నెవ్వర్’ అని కాస్త అవమానించేలా మాట్లాడింది అమెరికా. మరి ఇప్పుడు..! ఆపరేషన్ సింధూర్‌ను ముందుండి నడిపించింది సైన్యమే అయినా.. ఆ సైన్యం వెనకుండి కనిపించని యుద్ధం చేసింది మాత్రం.. మన శాటిలైట్సే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో అండతో శత్రువును ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాం. ఇంతకీ ఆపరేషన్ సింధూర్‌లో ఇస్రో పాత్రేంటి? ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా మన దగ్గరున్న ఆయుధ సంపత్తు ఏంటి? పాకిస్తాన్ నుంచి భారత భూభాగంపై ఈగ వాలినా సరే.. గుర్తించగల శాటిలైట్స్ ఉన్నాయ్ మన దగ్గర. అంత పిన్ పాయింట్‌గా అంతరిక్షం నుంచి చూడగల నిఘా వ్యవస్థ మన ఇస్రో సొంతం. పర్టిక్యులర్‌గా.. ఇండియన్ ఆర్మీ కోసమే 9 నుంచి 11 మిలటరీ ఉపగ్రహాలు పని చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా.. కేవలం ఉగ్ర స్థావరాలే మన టార్గెట్ అయ్యేలా.. గురి చూసి మరీ వాటినే కొట్టాం అంటే కారణం.. మన శాటిలైట్ వ్యవస్థే. ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారన్న కదలికలను గుర్తించి, వెంటాడి, ఆ డిటైల్స్ అన్నీ ఇండియన్ ఆర్మీకి రియల్‌టైమ్‌లో అందించింది ఇస్రో. ఇస్రో అంతరిక్షంలోకి పంపించిన కార్టోశాట్ సిరీస్ శాటిలైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈగ వాలినా సరే...