
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను హరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వెహికిల్ టు వెహికిల్ అనే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై దేశవ్యాప్తంగా త్వరలోనే ఈ విధానంఅమల్లోకి వస్తుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఏవైనా వాహనాలు రన్నింగ్‌లో ఉన్నట్టు వాటికి ఏవైనా ఇతర వాహనాలు దగ్గరకు వస్తే డ్రైవర్‌కు సంకేతాలను పంపి అప్రమత్తం చేసేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. టెలికమ్యూనికేషన్ల శాఖ సహాయంతో ఈ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు.
గురువారం దేశరాజధాని ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల రవాణా మంత్రుల వార్షిక సదస్సు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సరికొత్త వైర్‌లెస్ టెక్నాలజీ రెండు వాహనాల మధ్య కమ్యూనికేషన్‌ను ఉపయోగపడుతుందని నొక్కి చెప్పారు. దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలను జరుతుతున్నాయని.. దీని వలన 1.8 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. వీరిలో 66 శాతం 18–34 ఏళ్ల వయస్సు గల వ్యక్తునే ఉన్నట్టు తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో V2V కమ్యూనికేషన్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటించంచే విధంగా మోటారు వాహనాల చట్టంలో 61 సవరణలు చేయనున్నట్టు తెలిపారు. రాబోయే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపార. ఈ ప్రతిపాదిత మార్పులు రహదారి భద్రత, వ్యాపారం చేసే సౌలభ్యం, పౌర సేవలను మెరుగుపరచడంలో సహాయపడనున్నట్టు తెలిపారు. అలాగే రోడ్డుప్రమాదాల్లో గాయపడిన వారికి హాస్పిటల్‌లో క్యాష్‌ప్రీ ట్రీట్మెంట్ అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో దీన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.